Skip to main content
// ప్రార్ధన //
విశ్వకవి రవీంద్రుడి గీతం '' కోరొ జాగరిత '' కు స్వేచ్చానువాదం ... లకుమ
// ప్రార్ధన //
ప్రభూ !
ఎక్కడ చిత్త దీపమ్ము నిర్భీతి గ వెలుగునో?
ఎక్కడ మానవుడు హిమ నగం లా తలెత్తుకొని మనగలడో?
ఎక్కడ వీచికలు స్వేచ్చ్చా గీతికలై నలుదెశ లా వ్యాపించగలవో?
ఎక్కడ భూగోళం ఖండ ఖండాలై దేశాలై ప్రాంతాలై గోడలై విడిపోదో?
ఎక్కడ పదాలు పెదవులనూ ,పుటలనూ దాటేందుకిష్టపడతాయో?
ఎక్కడ నిరంతరా' న్వేషణ ' సుజలాం సుఫలాపేక్ష దిశ గా సాగిపోతుందో?
ఎక్కడ అనంత జ్ఞాన వాహిని అంధ విశ్వాసపుటెడారి దారుల్లో ఇంకిపోదో?
ఎక్కడ పని లోనూ.పాటలోనూ ప్రజ ప్రపంచాన్నే మరచిపోతుందో?
ఎక్కడకు చన మనస్సు ఉవ్విళ్ళూరు తుందో?
ఎక్కడకు హృదయాంతరాళం పర్వులు తీస్తుందో?
ఆ స్వేచ్చా స్వర్గం లోకి!
ఆ స్వర్గ లోక ద్వారం లోకి...!!
నా దేశం మేల్కొనునట్లు.....
మమ్మనుగ్రహించు...!...
Comments
Post a Comment