మామకు మామ ఐనవాడు .

మామకు మామ ఐనవాడు ...(కంది శంకరయ్య)

ఉ.

మామను సంహరించి, యొక మామను గర్వ మడంచి, య న్నిశా

మామను రాజుఁ జేసి, యొక మామ తనూజున కాత్మబంధువై,

మామకుఁ గన్ను లిచ్చి, సుతు మన్మథు నింతికిఁ దానె మామయై,

మామకు మామయైన పరమాత్ముఁడు మీకుఁ బ్రసన్నుఁ డయ్యెడున్.

(చాటుపద్య రత్నాకరము) 

భావం -

మామ అయిన కంసుని సంహరించి, వారధి కట్టడానికి ముందు తన మామ అయిన సముద్రుని గర్వాన్ని అణచి, నిశామామ అయిన చంద్రునికి `రాజు` అనే పేరునిచ్చి, మామ కొడుకైన అర్జునునకు ఆప్తుడై, మామ అయినధృతరాష్ట్రునికి కన్నులిచ్చి, కొడుకైన మన్మథుని భార్య రతీదేవికి తానే మామ అయి, తనకు లక్ష్మి నిచ్చిన మామ సముద్రునికి తన కూతురైన గంగనిచ్చి అతనికి మామ అయిన విష్ణుదేవుడు మీకు ప్రసన్నుడౌతాడు.

....

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!