మహానుభావుడు – ఆయనను మరిచే తెలుగు వాడు ఎవరు లెండి..

మహానుభావుడు – ఆయనను మరిచే తెలుగు వాడు ఎవరు లెండి


హరికథలు 

బుర్రకథలు

నాటకాల తో 

మాత్రం పురాణాలు తెలుసుకొంటున్న 

తరానికి 

తన పౌరాణిక పాత్రలతో

జీవం పోసి 

జనం గుండెల్లో 

రాముడిలా కృష్ణుడిలా విష్ణువుగా 

రావణుడిలా దుర్యోధనుడిలా కర్ణుడిలా 

నిలిచిపోయాడు


ఒక న్యాయమూర్తి 

ఒక పోలీస్ ఆఫీసర్ 

ఒక దేశ సైనికుడు

ఒక మేజర్ 

ఒక గుండమ్మ అల్లుడు 

స్వాతంత్ర సమరయోధుడు 

ఓ ప్రేమికుడు 

తండ్రి 

కొడుకు 

సోదరుడు 

ఓ రాజకుమారుడు 

కుంటివాడు 

పాండురంగడి భక్తుడు 

ఇలా ఎన్నో పాత్రలతో 

మన ఎన్ టీ యోడు అని ఆత్మీయంగా 

పిలుచుకొనేంత ఎత్తుకు ఎదిగాడు


దివి సీమ ఉప్పెనకు 

జోలె పట్టాడు


నవ శిశువు జన్మకాలమంత 

సమయం తీసుకొని 

రాజకీయ సునామీ సృష్టించి 

ముఖ్యమంత్రి అయ్యాడు


పేదవాడికి ఆయన పెట్టిన 

రెండు రూపాయల కిలో బియ్యం 

ఈ రోజు కూ 

పేద వాడి 

ఆకలి తీర్చుతోంది


తాజాగా 

విభజన తో 

మానసికంగా నలిగిన ప్రజల 

గుండెలు మండి 

మళ్లీ ఆయన పెట్టిన పార్టీ మీద 

ఆశలు నిలిపారు


అలాంటి మహనీయుడిని 

జన్మ దినం రోజు 

తలచుకోవడం ఆనందంగా వుంది 

అయినా ఆయనను మరిచే తెలుగు వాడు ఎవరు లెండి

Comments

Popular posts from this blog

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.