" స్వామీ ! ఐశ్వర్యా అంటే లక్ష్మే కదా "

" స్వామీ ! ఐశ్వర్యా అంటే లక్ష్మే కదా "!

.

ఏకాంత వేళలో వున్న శ్రీవారు , శ్రీదేవి తో " దేవీ ! చూడు ! ఈ ప్రపంచములో ఎంత ధనవంతులైనా , రూపవంతులైనా , అధికారులైనా నా దర్శనము కోసం ఎంత ప్రయాసపడుతున్నారో "

" . అవును స్వామీ ! తమరు శ్రీ నివాసులు కదా " అంటూ మురిసిపోసాగింది .

అందులోని మర్మమును గ్రహించిన స్వామీ " అహా ! అలా అని అది నీ గొప్పే అని అంటావా ? , ఎంతటి వారనా నా కోసము ఇక్కడకు కాలినడకన వస్తారు , అహము లేకుండా నిలువుదోపిడి ఇస్తారు , అందము మీద వ్యామోహము వుండకుండా సిరోజాలు సమర్పించుకుంటారు , కొందరు అడుగడుగు దండాలు , పొర్లు దండలు , తులాభారాలు ఇలా ఎన్నో మొక్కులు మొక్కి తీరాగానే శరీర శ్రమ అని లేకుండా మొక్కులు చెల్లిస్తారు , ఇవన్నీ కూడా శ్రీ నివాసుడనేనా చేస్తారు ? " అంటూ చిలిపిగా నవ్వుతూ..." పోయిన ఏడాది వచ్చిన ఈ దేశాధ్యక్షుడు , ఆ తరువాత వచ్చిన ఇంకో రాజకీయనాయకురాలు , కానుకగా మూడు కోట్లు ఇవ్వడము కూడా శ్రీనివాసుడనేనా , అదిగో అటు చూడు ఎంత మంది భక్తులో నిత్యము " గోవిందా , గోవిందా " అంటూ స్మరిస్తూ నా దర్శనము కోసం ఎంత ప్రయాస పడుతున్నారో , " 

"ఇది కాక పొరుగుదేశలనుండి ఎందరో భక్తులు ఎంతో ధనము వేచించి కష్టములకోర్చి నా కోసము చూడు దేవీ ! ఎలా వస్తున్నారో " 

" అటు చూడు ఆ తల్లి కి పెళ్ళయిన పదిహేడు సంవత్సరముల తరువాత పిల్లలు పుట్టినందుకు ఎలా పొర్లు దండాలు పెడుతోందో ... 

ఇటు చూడు ఈ తల్లి పిల్లాడికి వచ్చిన రోగము నయమైనందువలన అడుగడుగు బొట్లు పెడుతూ వస్తోందో " 

" వీరందరూ కూడా నా కరుణా కటాక్షములు కాక ఇంకేవన్నా కోరుకుంటున్నారా ? చెప్పు దేవీ ? "

ఇంతలో అక్కడ కోలాహలము ఎవరో సినిమా నటుడు , కుటుంబముతో వచ్చాడుట , అందుకే అందరినీ పక్కన తోసి వారిని పంపే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

" అదిగో అమితాబ్ , ఇదిగో అభిషేక్ , అదిగదిగో ఐశ్వర్య .."

అంతవరకూ " గోవిందా , గోవిందా " అంటొన్న భక్తులు

 ఒక్కసారిగా " ఐశ్వర్య , ఐశ్వర్య " అనడము మొదలెట్టారు . 

" స్వామీ ! ఐశ్వర్యా అంటే లక్ష్మే కదా " అని అమ్మవారు ,

 శ్రీవారిని అడగడం , శ్రీవారు మూతి ముడుచుకోవడం , అది చూసి ముసి ముసి నగవుతో సిరి.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!