టైం ఎందుకు ఉండదు?

టైం ఎందుకు ఉండదు? (అభిమానంతో మీ ప్రవీణ…..)

“అస్సలు తీరట్లేదంటే నమ్మండి. చాలా బిజీగా ఉంటున్నాను”

“ఊపిరి పీల్చుకోవటానికి కూడా టైం దొరకట్లేదు”

“లైఫ్ ఇస్ డామ్ హేక్టిక్”

కాలమానాలతో సంబంధం లేకుండా సంవత్సరం పొడుగునా ఇవే మాటలు పదే పదే వల్లె వేసేవారికి ఓ ఉచిత సలహా….మీరు పనులన్నీ పక్కన పడేసి యుద్ధప్రాతిపదికన హిమాలయాలకు ప్రయాణం కట్టి, బ్రహ్మ విష్ణు శివ పార్వతి మొదలగు దేవతలు, దేవుళ్ళ దర్శనం కొరకు ఘోర తపస్సు ఆచరించి రోజుకు నూట పాతిక గంటలు ఉండేలా వరం పొంది, అందులో ఓ రెండు మూడు గంటలు ఉచిత సలహా నిమిత్తం నాకు ఇచ్చేయ్యాలని మనవి. గమనించాలి, పనులన్నీ పక్కన పడేసి అన్నానే కానీ పనులు అవచేసుకుని అనలేదు!

నిజమే…జీవితంలో కొన్ని కొన్ని దశలలో చాలా బిజీగా ఉంటాం.

నిజంగా… జీవితమంతా అంత బిజీగా ఉంటామా?? జీవించటానికే తీరిక లేనంత పనులా మనకి?!

జీవితం ఎవరికీ వడ్డించిన విస్తరి కాదు. మనమే వండుకోవాలి, మనమే వడ్డించుకోవాలి. కనీసం ముద్దలు నోట్లో పెట్టుకునే తీరిక లేదు అనేవాళ్ళతోనే చిక్కు.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!