కాఫీ కప్పే!........( ప్రవీణ.గారి అద్బుత రచన ….)

కాఫీ కప్పే!........( ప్రవీణ.గారి  అద్బుత  రచన ….)
.
సగం తాగిన కాఫీ కప్పును విసురుగా నెట్టేసాడతను
టేబుల్ పై ఒలికిన చుక్కలపై ఒక్క చూపన్నా చూడకుండా
తన షులో తన పాదాలను ఇరికించేసుకుని
పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ
ఆఫీసుకు వెళ్ళిపోయాడు.

భారాన్ని మోస్తూ ముడుచుక్కూర్చుంటే ఇళ్ళు సాగదని
చీర కొంగుకో, చున్నీ అంచుకో
మూటగట్టగలిగినంత మూటగట్టి
నడుం బిగించిందామె.

మూల మూలలా పొడిగుడ్డతో దుమ్మును దులుపుతూ
కాఫీ టేబుల్ దగ్గరకు వచ్చింది.
బాధగా కసిగా గట్టిగా తుడిచినా వదలవే ఆ చుక్కలు!

ఆమె పెదవులు బిగిసి ఉన్నాయి.
నుదిటి నుంచో, కంటి నుంచో
ఓ చుక్క రాలిపడింది.
ఎండిన ఆ మరకలపై చెమ్మ చేసి వదిలించింది!

పిల్లల పాలు
పోపులో ఆవాలు
ఏవి గతి తప్పలేదు!

సూరీడు సెలవు తీసుకునే వేళ అతను తిరిగిచ్చాడు
తళతళలాడుతున్న టేబుల్ పై సిద్ధంగా ఉన్న
కాఫీ కప్పును అందుకున్నాడు.
చిక్కటి నురగలు కక్కే కాఫీ అతనికి ఇష్టం!

లోపల వంటింటి గట్టుపై
విరిగిపోయిన పాలను ఆమె శుభ్రం చెయ్యలేదని
ఆమె కప్పు అంగులమైనా కదలలేదని
అతనికి తెలీదు!

x

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!