వివేకచూడామణి ! (2వ భాగం .)
వివేకచూడామణి ! (2వ భాగం .) - శ్రీ ఆదిశంకరులు, ఈ వివేకచూడామణిలో దృశ్యప్రపంచ మిథ్యాతత్త్వం గురించి, బ్రహ్మ నిజతత్త్వం గురించి, జీవ బ్రహ్మైక్య భావం గురించి, బ్రహ్మతత్వాన్ని స్వానుభవ పూర్వకంగా తెలుసుకోవటానికి అవసరమైన సాధనల గురించి వివరంగా చెప్పారు. - కాలం, దేశం, కారణం : ఈ రెండు రకాలైన ప్రపంచాలకు కాల, దేశ, కారణ నియమాలు ఉన్నాయి. ఎప్పుడు? ఎక్కడ? ఎందుకు? అనే ప్రశ్నలు సదా పుడుతుంటాయి. ఈ మూడుప్రశ్నలు కాల, దేశ, కారణాలకు సంబంధించినవి. బాహ్యాంతర ప్రపంచమంతా, ఈ మూడిటి సంయోగ ఫలితమే అని చెప్పవచ్చు. ఉదయం తూర్పున ఉన్న సూర్యుడు, సాయంత్రం పడమరలో ఉంటాడు. ప్రొద్దు, సాయంత్రం కాలాన్ని తెలియచేస్తాయి; తూర్పు, పడమర దేశాన్ని తెలియచేస్తాయి. ఈ ఉదయాస్తమయాలను స్వాభావికమని మనసు ఒప్పుకోదు. దాని వెనకాల ఉన్న కారణం తెలుసుకోవాలనుకుంటుంది. ఎందువల్ల అనే ప్రశ్న పుడుతుంది. దానికి సమాధానం దొరికే వరకు మనసుకు శాంతి ఉండదు - ఎందువల్ల - ‘మనం భూమిమీద ఉన్నాం కాబట్టి, భూమి తన చుట్టూ తాను తిరుగుతున్నది కాబట్టి, సూర్యుడు తానున్న చోటనే కదలకుండా ఉన్నందువల్ల, (ఈ మూడు ప్రశ్నలే కాక ‘ఎవరు’ ఏమిటి?’ అనే ప్రశ్న సాధారణంగా ఎ...