-పుల్లయ్యవ్వారం !

-పుల్లయ్యవ్వారం !

-

పుల్లయ్యవ్వారం"అని వినే వుంటారు. ఈ సామెత పద విశేషం 

తెలియని వారికి మాత్రమే ఈ వివరణ.


పూర్వం పుల్లయ్య అనే పేరుగల ఒక తెలివితక్కువ దద్దమ్మ ఉన్నాడట. ఒకరోజు రాత్రి నిద్రపోతుండగా ప్రక్కగదిలో తల్లిదండ్రులు ఇలా మాట్లాడుకోవడం విన్నాడు

"రేపు ఉదయం మనం అత్యవసరంగా మన అబ్బాయి పుల్లయ్యను వేమవరం పంపించాల్సి వున్నది." 

ఇంతవరకే వాడికి వినబడింది. వెంటనే పుల్లయ్య "మా నాన్న అనుకుంటున్న విధంగా నేను ఉదయం వెళ్లే బదులు ఇప్పుడే వేెమవరం వెళ్లి వచ్చేస్తే మా నాన్న చాలా సంతోషిస్తాడు అనుకుని వెంటనే వెళ్లి తిరిగి వచ్చేసాడట.


తండ్రి ఉదయం లేచి పుల్లయ్య ను పిలిచి ఒరే అబ్బాయి! నీవు వెంటనే ఒక పనిపై వేమవరం వెళ్లి రావాలి" అంటూండగా పుల్లయ్య అడ్డుతగిలి హుషారుగా తండ్రి తన ప్రయోజకత్వాన్ని మెచ్చుకుంటాడని

'నాకు తెలుసు నాన్నా మీరు వెళ్లమంటారని 'అందుకే రాత్రే వెళ్లి వచ్చేసా' అన్నాడు.

దాంతో అతని తండ్రి "ఎందుకు వెళ్లినట్లు?" అని అడగ్గా ,.................

"ఏమో!ఎందుకు వెళ్లాలో మీరు

చెపితే కదా తెలిసేది? అమ్మతో నేను వేమవరం వెళ్లాలని రాత్రి చెప్పుతుంటే విన్నాను."

కొడుకు సమాధానానికి ఏమనాలో తెలియలేదట వాళ్ల నాన్నకు.

ఈ కథనుబట్టే "పుల్లయ్య వ్వారం"అనే సామెత వాడుకలోకి వచ్చింది.


ఎవరైనా ఒక పని అపసవ్యంగా చేసినప్పుడు. ఈ సామెతను పేర్కొంటారు.

-


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!