-పులిమీద పుట్ర -

-పులిమీద పుట్ర -

-

బోరుంది, పంపుంది. కాని కరెంటే లేదు ఏప్పుడొస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని స్దితి. రోజంతా చేనికాడే కరెంట్ రాకడకై ఎదురు చూపులయ్యే. పులిమీద పుట్ర లాగా వూరిలోకి హైనా వచ్చి పిల్లలనెత్తుకుపొతున్నదన్నవార్త. హైనాను చంపేటందుకు వూరిజనమంతా ఒక్కటైనారు.

'

"పేదరికాన్ని ఆసరాచేసుకునే ప్రభుత్వాలూ మంత్రులూ పుట్టుకొస్తారు. పేదరికం నశిస్తే ఈవ్యవహరమే వుండదు. ఏదేశంలో నయినా ఇంతే జరిగేది. అందుకే ప్రభుత్వాలు పుట్టాక అవి వశించకుండా వుండే పనులే చేస్తాయి. బ్యాంకుల అప్పులూ, వడ్డిలూ, సబ్సిడీలూ, చిల్లర సహాయాలూ, అన్నీఅవే.మనల్ని కలిసికట్టుగా చేరకుండా పేదరికాన్నిపూర్తిగా తొలగించకుండా-అట్లాచావకుండా ఇట్లాబతక్కుండా శవల్లా నడిపిస్తాయి. కాబట్టే హైనాను ఎదుర్కొటానికి కలిసినట్లుగా కరువును ఎదుర్కోటానికి కలవం. పిల్లలకు భవిష్యత్తు లేకుండా హైనాచేస్తే, ఎవ్వరికి భవిష్యత్తు లేకుండా కరువు చేస్తున్నది. ఎన్నోవేలరెట్లు హైనా కన్న కరువు భయంకరమైనా ఎందుకు అడ్దుకోలేమో!

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!