బావయామి గోపాలబాలం.!

బావయామి గోపాలబాలం.!

.


వెదురును అయినా కాకపోతిని .......

నీ చేతిలో వేణువై శాశ్వతంగా నిలిచిపోతిని


నువ్వు పలికే రాగాల్లో ఒక రాగమైన కాకపోతిని 

నీ పలుకులో నిలిచే భాగ్యం కలిగేది


నీ నామాలలో ఒక నామమైన కాకపోతిని 

నీ నుదిటిపై శాశ్వతంగా ఉండాటానికి


నెమలి పింఛమైన కాకపోతిని 

నీ శిరస్సున అలంకారముగా ఉండే భాగ్యం కలిగేది


నీ భక్తులలో ఒకరిగా నిరంతరం నిన్నే ధ్యానిస్తున్నా 

నీ మదిలో నాకు స్థానం కల్పించు స్వామీ


శాశ్వత ప్రేమాభిమాలను నాలో నిలుపు తండ్రి 

ఏమి ఆశించి నీ భక్తురాలిగా మారలేదు


నిష్కల్మషమైన మనసుతో నిన్నే అరాదిస్తున్నా 

నిరంతరం నీ నామమే జపిస్తూ ..... 

నిన్నే కొలుస్తూ .....


నీ దర్శన భాగ్యం కోసం ఎదురుచూస్తూ 

కనులలో నీ రూపాన్ని నిలుపుకుని 

=


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!