టెల్గూ బాష!

టెల్గూ బాష!

.

ఇప్పుడెలాగూ వత్తులు లేని భాష మన తెలుగు భాష, సారీ టెల్గూ బాష కనుక 

ఈ మధ్య ‘మధ్య’ కాస్త ‘మద్య’ అయిపొయింది.

ఆ రోజుల్లో కాబట్టి తాగినా చక్కటి తెలుగు మాట్లాడేవాడు దేవదాసు.

దేవదాసు పాత్రలో అక్కినేని గారు అంత సహజంగా నటిస్తే ఆయన 

నిజంగానే తాగేరేమో అనుకునేవారట. 

పెరుగన్నం, ఆవకాయ తిని కాస్త నిద్రలోకి జారుకుంటున్నప్పుడు

ఆ డైలాగులు అప్పజెప్పేను అని ఏ.ఎన్.ఆర్. చెబుతుండేవారు.

అందుకే ఆయన మహా నటుడు.

‘నటన’ అంటే ప్రతి విషయము లోనూ అనుభవమున్నది అని అర్ధం కాదు. 

నటనము అంటే కపట నర్తనము అని నిఘంటువు చెబుతుంది.

నటన అంటే గుర్తొచ్చింది. మా గురువొకాయన పార్టీ లో భలే నటిస్తారనుకో. 

ఓ చేత్తో పెగ్గుచ్చుకునీ ఊరికే అటూ ఇటూ తిరుగుతూ వాళ్ళనీ వీళ్ళనీ పలకరిస్తూ ఉంటారు కానీ డేంజర్ లో పడరు. పెగ్గు తీసుకోలేదనుకో ఆయన్ని సిగ్గు లేకుండా సతాయిస్తారు కదా, అదీ తెలివి.

గొప్ప అప్ర’మత్తుడు’ అన్న మాట.

-

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!