బాల శిక్ష.....ఎవరు వ్రాయించారు !

బాల శిక్ష.....ఎవరు వ్రాయించారు !

_

ఈ మధ్య ఫేస్ బుక్ లోనే అనుకుంటా, బాలశిక్ష గురించి ఎవరో ప్రస్తావిస్తూ, "భారత దేశం లో, 'కుంఫిణీ' పాలనలో, 'నేటివు ' ల లో అవినీతి పెరిగిపోతోంది అని, వాళ్లకి నీతులు బోధించడానికి బాల శిక్ష ఇంగ్లీషు వాళ్లే రాయించారు" అనీ, "ఆరుద్ర" కూడా తన పరిశోధన లో అలా ఒప్పుకున్నాడు అనీ, వ్రాశారు

.

శ్రీ శ్రీ "మహాకవి"; కాళోజీ "ప్రజా కవి"....మరి ఆరుద్ర "సినీ కవి", లేదా "సినీవాలి" కవి అనొచ్చేమో!


బాలశిక్ష ఇంగ్లీషువాళ్లు వ్రాయించడం అన్నది నిజమే గానీ, దాని ఉద్దేశ్యం మాత్రం......నేటివు ల భాష తెలిస్తే ఇంకొంచెం బాగా ఊడిగం చేయించుకోవచ్చు అనే ఆలోచనతో, ఇంగ్లీషువాళ్లకి తెలుగు నేర్పడానికి......అనేది నిజం!

-

1950 ల లో, మా స్కూలు కరెస్పాండెంట్లు గా ఆంగ్లేయులు వచ్చేవారు. మా స్కూలు గ్రౌండ్ లో వారికో బంగళా ఉండేది. వర్షం వస్తే, గ్రౌండ్ అంతా బురద తో నిండి పోయేది.....ముఖ్యంగా వారి బంగళా ముందు!

ఆ దొరసానమ్మ, ప్యూన్ వెంకన్న ని అజమాయిషీ చేసేది!

"వేంఖణా.....ఓ వేంఖణా.....దొరగారి కారు మడ్డ్ లోన కూరుకు పోయినది. ఆయనను లోనికి పిలిచి, పారతో ఆ మడ్డ్ ను తొలగించుము....!" అని ఆజ్ఞాపించేది.

(.....బురద లో కూరుకు పోయింది....దొరగారిని లోపలకి పంపించేసి.......తొలగించు.....అని.)

-

దొరగారు, ప్రొద్దున్నే కాసేపు గార్డెనింగ్ చేసి, పంక్చువల్ గా టిఫిన్ టైముకి లోపలికి వెళ్లిపోయేవారు.

"వేంఖణా.....ఓ వేంఖణా.....మడ్డ్ ని బాగుగా కడిగి, దొరగారి 'గ్ ద్ద్ ' లోన పెట్టుము...." అనేది, బురదతో దొరగారు వదిలేసిన గెడ్డపారని చూపిస్తూ!

-

(దాన్ని, బురద కడిగేసి, దొరగారి గది లో పెట్టు.....అని.)

ఇవి మచ్చుకి కొన్నిమాత్రమే!

ఇలాంటి వాళ్లకోసమే, బాలశిక్షా, పెద్ద బాలశిక్షా వ్రాయించారు వాళ్లు!

అదీ నిజం.

-


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!