-కాకర్ల త్యాగరాజస్వామి.-


-కాకర్ల త్యాగరాజస్వామి.-

(Vydehi Murthy గారి పోస్ట్ వారికీ కృతజ్ఞలతో )

-

సంగీతాన్ని ప్రేమించి .సీతమ్మ మా అమ్మ, శ్రీరాముడు నాకు తండ్రి ..

ఆయన పాదాలదగ్గర 'బంటురీతి కొలువు' చాలు అంటూ 

శ్రీ రాముడి కుటుంబం నా కుటుంబం అని చెప్పిన మహా వాగ్గేయకారుడు, .శ్రీరామచంద్రమూర్తికి పరమ భక్తుడు కాకర్ల త్యాగరాజస్వామి.

-

త్యాగరాజు పూర్వీకులు ఆంధ్రప్రదేశ్ లోని కాకర్ల నుండి తమిళనాడులోని తిరువాయూరుకి వలసవెళ్ళారు, తిరువాయూరు స్వామి పేరు త్యాగరాజస్వామి.. అందువల్ల త్యాగరాజు అని పేరు పెట్టారు త్యాగయ్యకి అతని తండ్రి కాకర్ల రామబ్రహ్మం..రామబ్రహ్మం కి ఉన్న రామభక్తి త్యాగయ్య కి వచ్చింది. 

త్యాగరాజు సంగీతం లేకపోతే కర్ణాటక సంగీతమే లేదనేంత పేరు తెచ్చుకున్న త్యాగరాజు చాలా కీర్తనలు రాశారు.

-

ఆయన కీర్తనలలో 'ఘనరాగ పంచరత్న కీర్తనల' గురించి ఎంత చెప్పిన తక్కువే,,

‘’స్వరార్ణవం’ ‘నారదీయం’ అనే రెండు సంగీత శాస్త్రగంథాలను రచించిన త్యాగయ్య... తిరుపతి వేంకటేశ్వరుని దర్శనం కోసం వెళ్ళినప్పుడు అక్కడ తెరవేసి ఉంటే, 'తెరతీయగరాదా' అనే పాట పాడితే తెరలు తొలగిపో యాయని ఆ తరువాత ఆయన 'వేంకటేశ నిను సేవింప' అనే పాట పాడారని ఈరోజుకీ చెప్తారు.కర్ణాటక సంగీత త్రిమూర్తులలో ఒకరైన త్యాగయ్య, సంగీతం తో శ్రీరాముడికి దగ్గరైన మహానుభావుడు..

బాలకనకమయ.. అంటూ అటన రాగం లో, నగుమోము గనలేని - అంటూ ఆభేరి రాగం లో.. పాడిన త్యాగయ్య ..'ఎందరో మహానుభావులు..అందరికీ వందనములు’ .. 

అనే కీర్తించినా.. 'ఓడను జరిపే ముచ్చట కనరే' అని సంతోషం గా చెప్పినా ‘గంధము పుయ్యరుగా.. పన్నీరు గంధము పుయ్యరుగా'..అని ఆలపించినా... 'జగదానంద కారకా 'అని ఆనందించినా ‘మరుగేలరా..ఓ రాఘవా'.. అని స్తుతించినా... బ్రోచేవారెవరే రఘుపతే- (శ్రీరంజని రాగం) అనీ.. 'దొరకునా ఇటువంటి సేవ' అని సేవ చేసుకున్నా త్యాగయ్యకే చెల్లింది..

ఈరోజుకీ ఎంతోమంది... సంగీతాన్ని నేర్పడం వృత్తిగా చేసుకున్నవారు ఎక్కువగా పాడేది ,నేర్పించేది త్యాగరాజు కీర్తనలే..

శ్రీరామపరమభక్తుడు, సంగీత జ్ఞాని ...త్యాగరాజస్వామిజయంతి సందర్భం గా

త్యాగయ్య పాదపద్మాలకి 

ప్రేమతో ..వైదేహి

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!