ఆకులో-ఆకునై ' !

ఆకులో-ఆకునై ' !

.

గిద్దలూరు-నంద్యాల బస్సు మరియు రయిల్ మార్గంలో 

గిద్దలూరు కు 10కి.మీ.ల దూరం లో దిగువమెట్ట వున్నది .

దిగువమెట్ట వద్దవుండి నల్లమల్ల అడవి మొదలుఅయ్యి 

గాజులదిన్నె వద్ద అడవి ముగుస్తుంది

అడవి వేడల్పు 40-45 కి.మీ.వున్నది.వర్షకాలం లో అన్ని చెట్లు చిగిర్చి అడవి అంతపచ్చగాతివాచిపరచినట్లుకనులవిందుగా

వుండును.

ఎత్తుఅయ్యినకొండలు,లోయలతో బస్సు ప్రయాణం చెయ్యునప్పుడు అందమయిన అనుబూతి కల్గుతుంది.

క్రిష్ణ శాస్త్రి గారికి సంబంధించిన వ్యాసాలలో'ఆకులో ఆకునై ' అనే పాటనుఆయన రయిలులో విజయవాడ నుండి బళ్ళారి వెళ్ళునప్పుడు చూసి పరవసించి వ్రాసినట్లు ఒక వ్యాసంలో పెర్కొడం జరిగింది.

.

పల్లవి :


ఆకులో ఆకునై పూవులో పూవునై


కొమ్మలో కొమ్మనై నునులేత రెమ్మనై


ఈ అడవి దాగిపోనా ఎటులైనా ఇచటనే ఆగిపోనా


వివరణ : 

కవి అడవి సౌందర్యానికి ముగ్ధుడై అక్కడి ఆకులు, పువ్వులు, కొమ్మలు, రెమ్మలతో తానూ ఒకడిగా కలసిపోయి అక్కడే ఉండిపోవాలని కోరుకుంటున్నాడు.


చరణం 1 :


గలగలనీ వీచు చిరుగాలిలో కెరటమై


జలజలనీ పారు సెలపాటలో తేటనై


పగడాల చిగురాకు తెరచాటు తేటినై


పరువంపు విరి చేడే చిన్నరి సిగ్గునై


ఈ అడవి దాగిపోనా ఎటులైనా ఇచటనే ఆగిపోనా


వివరణ :

తన మనసులోని భావాల్ని మరింత లోతుగా తరుస్తూ చిరుగాలిలో కెరటం లాగా, సెలయేరులో తేటగా, పూలమొగ్గలోని సిగ్గుగా వాటన్నితో కలసిపోవాలని కోరుకుంటాడు.


చరణం 2 :


తరులెక్కి ఎలనీలి గిరినెక్కి మెలమెల్ల


చదలెక్కి జలదంపు నీలంపు నిగ్గునై


ఆకలా దాహమా చింతలా వంతలా


ఈ కరణి వెర్రినై ఏకతమా తిరుగాడ


ఈ అడవి దాగిపోనా ఎటులైనా ఇచటనే ఆగిపోనా


వివరణ : 

అక్కడ అడవిలోని చెట్లు, ఆ చెట్ల పైనుంచి నీలి కొండలు ఎక్కుతూ మెలమెల్లగా ఆకాశాన్ని చేరుకొని నీలి మబ్బులోకి చేరి దాని నీలిరంగులో కలిసి ప్రకాశిస్తూ ఆకలి - దాహం చీకులు, చింతలూ లేకుండా ఏకాంతంగా విహరిస్తూ వెర్రివాడిలా తిరుగుతూ ఆ అడవిలోనే కలిసిపోయి ఉండిపోనా అంటూ కవి ప్రకృతిలో తానూ మమేకమయిపోవాలని కోరుకుంటున్నాడు.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!