కొసరు!

కొసరు!

-

అమ్మ చేతి ముద్దలు కడుపునింపే సాక వేళ్ళ పై ఆనుకొని

నూగుగా మెరుస్తూ గిన్నె అంచుకు చేరి నాలుక పై వాలే

కొసరు ఎంత బాగుంటందని……

.

ఏ భాషకు పూస్తేనేమిటి కలానికి అంటి మెరిసే నక్షత్రాలు

భావాల చల్లదనం తో సేద తీర్చినాక మెత్తగా ముక్కు నంటే

అర్ధపు పరిమళపు కొసరు హృదయానికి హత్తుకుంటే ఎంత బాగుంటుందని ….

.

కన్నీరో !పన్నీరో ! 

వేదనో ! నివేదనో ! 

మైమరుపో ! ప్రకృతి మెరుపో !

వేరే బాష అందాలను మన తీపి తెలుగులో వడ్డిస్తే 

ఏ హృదయంద్రవించదు , ప్రతిధ్వని వినిపించదు …. 

అదే నా కలం నుండిజాలువారిన కొసరు . 

కలాల అలల పల్లకి లో సేద తీరండి.


మీ సావిత్రి !

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!