శ్రీకంఠచాపఖండన-పోతనగారి రామ స్తుతి.!

శ్రీకంఠచాపఖండన-పోతనగారి రామ స్తుతి.!


కందము .


శ్రీకంఠచాప ఖండన!


పాకారిప్రముఖ వినుత భండన! విలస


త్కాకుత్స్థవంశమండన!


రాకేందు యశోవిశాల! రామనృపాలా!


టీకా:

శ్రీకంఠచాపఖండన = శ్రీరామ {శ్రీకంఠచాపఖండనుడు - శ్ర్రీకంఠుని (కఱ కంఠుడు యైన శివుని) చాప (విల్లును) ఖండనుడు (విరిచినవాడు), రాముడు};

పాకారిప్రముఖ వినుత భండన = శ్రీరామ {పాకారిప్రముఖ వినుత భండనుడు - (పాకాసురుని శత్రువైన ఇంద్రుడు) మున్నగువారిచేత వినుత (పొగడబడిన) భండన (యుద్ధము కలవాడు), రాముడు};


విలసత్కాకుత్స్థ వంశ మండన = శ్రీరామ {విలసత్కాకుత్స్థ వంశ మండనుడు - విలసత్ (ప్రసిద్ధికెక్కిన) కాకుత్స్థవంశ (కకుత్స్థ మహరాజ వంశమునకు) మండనుడు (అలంకారమైనవాడు), రాముడు};


రాకేందు యశోవిశాల = శ్రీరామ {రాకేందు యశోవిశాలుడు - రాకేందు (నిండుపున్నమిచంద్రుని) వంటి యశః (కీర్తి) విశాలుడు (విరివిగా కలవాడు), రాముడు};


రామ = రాముడు అనెడి {నిండుపున్నమి చంద్రుని పదహారు కళలు - 1అమృత 2మానద 3పూష 4తుష్టి 5పుష్టి 6రతి 7ధృతి 8శశిని 9చంద్రిక 10కాంతి 11జ్యోత్స్న 121శ్రీ 13ప్రీతి 14అంగద 15పూర్ణ 16పూర్ణామృత}; నృపాల = రాజా.


భావము:


శివుని విల్లు విరిచిన వాడ!


ఇంద్రాది వారు సైతం మెచ్చుకొనేలా యుద్ధం చేయవాడ!


ప్రకాశమానమైన కాకుత్స్థ వంశానికి అలంకారమైనవాడ!


నిండుపున్నమి వెన్నెల వంటి స్వచ్ఛ మైన కీర్తి విరివిగా కలవాడ!


ఓ శ్రీరామచంద్ర ప్రభో! నీకు నమస్కారం.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!