Posts

Showing posts from August, 2016

ఆడపిల్ల !

Image
ఆడపిల్ల ! రోడ్డు మీద ఒకమ్మాయి కనిపిస్తే చాలు మనసులో సునామీ లా వంద ఆలోచనలు క్షణం లో ఒచేస్తాయి... వెంటపడి వేధించి, కుదరకపోతే చంపెసేతంతటి దరిద్రంగా తయారవుతోంది నేటి సమాజం.... ఇంతటి క్రూరం గా తాను మనిషిని అన్న నిజాన్ని కుడా మరిచిపోయి అడవి జంతువులా ప్రవర్తిస్తున్నారు..... వీళ్ళందరూ ఒక ఎత్తైతే ప్రతి రోజు అమ్మాయిలని మానసికంగా వేదిన్చేవాళ్ళ సంగతి చెప్పనక్కరలేదు... ఆ వేదనలకు తట్టుకోలేక, ఎవరితోనూ చెప్పుకోలేక మనసులోనే కుంగిపోతూ ఎంత మంది ఆడపిల్లలు ప్రతీ క్షణం నరకయాతన అనుభవిస్తున్నారో... ఏ స్త్రీనైతే నవ్వు భాధపెడుతున్నవో అదే స్త్రీ జన్మనివ్వకపోతే నవ్వు అసలు ఈ భూమి మీద లేవు అనే నిజాన్ని గుర్తెరిగి ప్రతీ ఒక్కరు ప్రవర్తించాలని ఆశిస్తున్నాను..!

శివారెడ్డి కవి(తా) పరిచయం !

Image
శివారెడ్డి కవి(తా) పరిచయం ! (కన్నెగంటి చంద్రశేఖర్, ) "ఇక్కడ రెండే మార్గాలు, రెండే పక్షాలు  జనమున్నారు జనకంటకులున్నారు  ప్రజలున్నారు ప్రజల్ని హింసించే ప్రభుత్వమూ వుంది గడ్డం పెంచుకుని బొట్టు పెట్టుకుని ప్రభుత్వ జపమాల తిప్పుతావా  జనంలో కలిసిపోయి జనయుధ్ధాన్ని ఎక్కుపెడతావా  నిర్ద్వంద్వంగా నిర్ణయించుకో నిశ్చయించుకో  నిజం పలకటం నీకూ మాకూ క్షేమదాయకం"  (ఎటు నిలబడతావో, మోహనా! ఓ మోహనా!, 1987) అంటూ తన మార్గాన్ని ఎన్నుకొని తన కవిత్వాన్ని ఎక్కుపెట్టటమే కాక ప్రతి పాఠకుణ్ణీ నిలదీసి ప్రశ్నిస్తున్న కవి కె. శివారెడ్డి. విప్లవ సాహిత్య సంఘాలకు బయట ఉంటూనే విప్లవ సాహిత్యాన్ని సృష్టిస్తున్న వాళ్ళు అనేకులు ఉన్నా, తనదంటూ ఒక ప్రత్యేకమైన శైలీ, పదజాలం ఏర్పరచుకున్న కవిగా శివారెడ్డి ప్రముఖ స్థానంలో  నిలబడతారు. ఇవాళ తెలుగు కవిత్వాన్ని బలంగా ప్రభావితం చేస్తున్న  వాళ్ళలో స్పష్టంగా వినిపించే గొంతు శివారెడ్డిది. 1980ల తర్వాత కలం  పట్టిన ఆధునిక కవులంతా శివారెడ్డి వ్యక్తిత్వ కవిత్వాలతో ప్రభావితం కాబడ్డవారేనన్నది విమర్శకులంతా అంగీకరిస్తున్న సత్యం. ఇతని కవిత

కల్పవృక్షంలో కైక –రచన : భైరవభట్ల కామేశ్వరరావు.

Image
కల్పవృక్షంలో కైక –రచన : భైరవభట్ల కామేశ్వరరావు. . రామాయణ కథని మలుపు తిప్పిన స్త్రీ పాత్రలలో కైకది ఒక కీలకమైన పాత్ర అని అందరికీ తెలిసిన విషయమే. దశరథుని ఆకాంక్ష మేరకు రాముని పట్టాభిషేకం జరిగిపోయుంటే, రామాయణం అక్కడితో ఆగిపోయేది. అది కాకుండా మలుపు తిప్పినది కైక. అయితే, వాల్మీకి రామాయణంలో కైక పాత్ర కీలకమైనదే కాని, చాలా పరిమితమైనది. కేవలం రామపట్టాభిషేక సందర్భంలో, అలుక పూని, వరాలడిగి, పట్టాభిషేకం చెడగొట్టి, రాముడిని అడవులకి పంపించడం వరకే ఆమె పాత్ర మనకి ప్రముఖంగా కనిపిస్తుంది వాల్మీకంలో. ఆ తర్వాత కథని ముందుకి నడిపించేది సీత. రాముని సర్వ ప్రయత్నమూ సీత కోసమే. ముందుగా లంకలోకి ప్రవేశించి, లంకని సర్వనాశనం చేసి, చివరకి రావణునితో పాటు సర్వ రాక్షస సంహారానికీ కారణమైనది సీతే. అందుకే వాల్మీకి మహర్షి రామాయణాన్ని గురించి “సీతాయాశ్చరితం మహత్” అన్నది. అంతటి సీత పాత్రకి సరిజోడుగా, అంతటి ప్రాధాన్యమున్న పాత్రగా కల్పవృక్షంలో కైకని తీర్చిదిద్దారు విశ్వనాథ.  రావణసంహారం చేసి వనవాసం ముగించుకొని సీతారామలక్ష్మణులు అయోధ్యకు తిరిగి వచ్చిన్నప్పుడు కైకేయి సీతని కౌగిట చేర్చుకొని యిలా అంటుంది: కైకెయి సీత గౌగిట

అవును కదా .. బియ్యం డబ్లు ఇచ్చాడు

Image
                          అవును కదా .. బియ్యం డబ్లు ఇచ్చాడు

చల్లగ చూడాలీ పూలను అందుకు పోవాలి !

Image
చల్లగ చూడాలీ పూలను అందుకు పోవాలి ! (మనజమున కి శుభాకంక్షలుతో పెళ్లినాటి ప్రమాణాలు లోపాట.) కావనగానే సరియా ఈ పూవులు నీవేగా.. దేవీ.. పల్లవి: చల్లగ చూడాలీ పూలను అందుకు పోవాలి దేవీ.. చల్లగ చూడాలీ పూలను అందుకు పోవాలి మల్లె సుగంధం మనసున జల్లి మళ్ళీ అల్లరి తగునా.. చల్లగ చూడాలీ పూలను అందుకు పోవాలి చరణం: మలయానిలముల లాలన వలెనే వలపులు హాయిగ కురిసీ.. | మలయానిలముల | కలికి చూపులను చెలిమిని విరిసి చిలిపిగ దాగుట న్యాయమా? .. చల్లగ చూడాలీ పూలను అందుకు పోవాలి చరణం: తెలి మబ్బులలో జాబిలి వలెనే కళకళ లాడుచు నిలిచీ.. | తెలి మబ్బులలో | జిలిబిలి సిగ్గుల పిలువక పిలిచి పలుకక పోవుట న్యాయమా?.. చల్లగ చూడాలీ పూలను అందుకు పోవాలి మల్లె సుగంధం మనసున జల్లి మళ్ళీ అల్లరి తగునా.. చల్లగ చూడాలీ పూలను అందుకు పోవాలి

పిఠాపురం.!

Image
పిఠాపురం.! పిఠాపురాన్ని పూర్వం పీఠికాపురం అనేవారు. ఈ ఊరుకి అధిపతిపిఠాపురాన్ని పూర్వం పీఠికాపురం అనేవారు. ఈ ఊరుకి అధిపతి పీఠాంబ. ఈ పీఠాంబ విగ్రహం ఒకటి - ఒక చేతిలో బంగారు పాత్ర, వేరొక చేత బాగుగా పండిన ఉసిరి కాయ, మూడవ చేత త్రిశూలం, నాల్గవ చేత లోహ దండం ధరించి - నేటి పిఠాపురానికి సమీపంలో, నాలుగు వీధులు కలిసే కూడలిలో ఉండేదట. ఇటువంటి విగ్రహమే ఒకటి ఈనాడు కొత్తపేటలో కుమారస్వామి ఆలయంలో ఉంది. ఈ విషయాన్ని ప్రముఖ కవీశ్వరుడు శ్రీనాధుడు భీమేశ్వర పురాణం లో ఈ కింది విధంగా చెబుతాడు. "హాటక పాన పాత్రయును నారగ బండిన మాతులుంగమున్ ఖేటము లోహదండము నొంగి ధరియించి పురోపకంఠశృం గాటక భూమి భాగమున గాపురముండెది పీఠికాంబకుం గైటభదైత్యవైరిప్రియ కాంతకు మ్రొక్కె నతండు భక్తితోన్." పిఠాపురానికి ఉత్తర దిక్కున ఏలేరు అనే ఏరు ఒకటి ఉంది( ప్రస్తుతం దీనిని చెరుకుల కాలువ అని అంటున్నారు). ఈ ఏలేరుని "జగతి నెక్కడివేలేటి సాటి నదులు" అంటాడు శ్రీనాధుడు అలా అనేసి ఊరుకోకుండా- "ఏలేటి విరినీట నిరుగారునుంబండు ప్రాసంగు వరిచేలు పసిడిచాయ." అని చెబుతూ పిఠాపురం ప్రాంతం సస్యశ్యామలంగా ఉండేదని అప్ప

బాలభాష - శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి!

Image
బాలభాష - శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి! . చిన్నారి పొన్నారి చిఱుత కుఱ్ఱఁడ రార! . అయ్య రారా! చక్కనయ్య రార! అల్లారు ముద్దుల పిల్లవాఁడా రార! . అప్ప రారా! కూర్మికుప్ప రార! రత్నాల చిటిముల్లె రార! నవ్వుంబువ . తోట రారా! ముద్దుమూట రార! ముత్యాల క్రోవి రా! ముచ్చట్లదీవి రా! . పల్కు వెన్నెల చిన్ని చిల్క రార! కన్నకాచి రార! గారాలకూచి రా! . నాన్నరార! చిన్నియన్నరార! ఆడ రార! నవ్వులాడ రారా! పల్కు లాడ రార! కుల్కులాడ రార!

కోన సీమ అందాలు !

Image
కోన సీమ అందాలు !

అల్లూరి సీతారామరాజు వేషం లో అన్నగారు. (1955 లో అనుకొన్నారు.)

Image
. అల్లూరి సీతారామరాజు వేషం లో అన్నగారు. (1955 లో అనుకొన్నారు.) x

వైర్ లెస్ టెక్నాలజీ !

Image
మన సర్దార్జీ అమెరికా వెళ్లి బిల్ గేట్స్ తో మీటింగ్ లో పాల్గొన్నాడు . మా దేశం ఎంత అభివృద్ధి చెందిందో నీకు చూపిస్తా రా అంటూ ఒక అడవికి తీసుకెళ్ళాడు . "ఇక్కడ గొయ్యి తవ్వు", సర్దార్జీ అలాగే తవ్వాడు... "ఇంకా లోతుకి తవ్వు" అంటూ వంద అడుగులు గొయ్యి తీయించాడు. "ఇప్పుడు . వెతుకు ఏదైనా దొరుకుతుందేమో" అన్నాడు సర్దార్జీ వెతికితే ఒక వైరు దొరికింది "చూసావా వంద ఏళ్ల క్రితమే మేము టెలిఫోన్ వాడాము అన్నదానికి ఇది రుజువు" . సర్దార్జీ కి వళ్ళు మండింది, తమాయించుకున్నాడు . ఆ తరువాత బిల్ గేట్స్ మన ఇండియా కి వచ్చాడు, అప్పుడు మన సర్దార్జీ గేట్స్ ని కలిసి మా దేశం గొప్పతనం కూడా చూపిస్తా రమ్మని అడవికి తీసుకెళ్ళాడు . "అక్కడ గొయ్యి తీయమన్నాడు.. గేట్స్ అలాగే గొయ్యి తీసాడు, "ఇంకా లోతు ఇంకా లోతు" అంటూ అయిదు వందల అడుగులు లోతు తీయించాడు. . "ఇప్పుడు వెతుకు ఏదైనా దొరుకుతుందేమో" అన్నాడు . పాపం ఎంత వెతికినా గేట్స్ కి ఏమీ దొరకలేదు.. . . . . . వెంటనే మన సర్దార్జీ "చూసావా అయిదు వందల ఏ

శ్రీకృష్ణ శతకం.!............... (శ్రీ నరసింహ కవి.)

Image
శ్రీకృష్ణ శతకం.!............... (శ్రీ నరసింహ కవి.) . కుక్షిని నిఖిల జగంబులు నిక్షేపము జేసి ప్రళయ నీరధి నడుమన్ రక్షక వటపత్రముపై దక్షతఁ పవళించునట్టి ధన్యుడు కృష్ణా! . ప్రతిపదార్థం: రక్షక అంటే అందరినీ రక్షించే; కృష్ణా అంటే ఓ శ్రీకృష్ణా; కుక్షిని అంటే నీ పొట్టయందు; నిఖిల అంటే సమస్తమైన; జగంబులను అంటే లోకాలను; నిక్షేపము చేసి అంటే దాచిపెట్టి; ప్రళయ అంటే ప్రళయ సంబంధమైన; నీరధి అంటే సముద్రము యొక్క; నడుమన్ అంటే మధ్యభాగంలో; వటపత్రముపై అంటే మర్రి ఆకు మీద; దక్షతన్ అంటే నేర్పు; పవళించునట్టి అంటే నిద్రిస్తున్న నీవు; ధన్యుడు అంటే గొప్పవాడివి. . భావం: ఓ శ్రీకృష్ణా! సమస్తలోకాలను పొట్టలో దాచుకున్నవాడా! ప్రళయకాలంలో మహాసముద్రం మధ్యలోఒక చిన్న మర్రి ఆకు మీద ఎంతో తెలివిగా నిద్రిస్తావు కదా! ఎంత ఆశ్చర్యం! . ముందుగా ప్రపంచాన్ని సృష్టించి, కొంతకాలం అయిన తరవాత ప్రళయాన్ని సృష్టిస్తాడు విష్ణువు. ఏది జరుగుతున్నా ఆయన నవ్వుతూ హాయిగా మర్రి ఆకుమీద సముద్ర మధ్యంలో పడుకుంటాడు. అంటే కష్టసుఖాలు ఏవి కలిగినా వాటిని చిరునవ్వుతో స్వీకరించాలే గాని అధికంగా సంతోషపడకూడదు, అధికంగా బాధపడకూడదు అని కవి ఈ పద్యంల

ఇప్పుడూ, ఎప్పుడూ కావలసింది..... "మత ప్రసక్తి లేని..... "!

Image
కొందరు మేథావులు అంటున్నట్టు.... కావలసింది  "మత రహిత", "కుల రహిత", లేదా.... "మత సహిత ", "కులసహిత" కాదు! అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ కావలసింది..... "మత ప్రసక్తి లేని..... "!  అది కాంగీ ల వల్లా, కమ్మీల వల్లా అవదు అని తేలిపోయింది.  ఇంకా మిగిలింది.... "ఫలానా వాళ్ళ" వల్లే.....! చూద్దాం .....! . మన దేశంలో కుల నిర్మూలన జరగాలని కలలు కన్న వారు కను మరుగై పోయారు.మన బారత రాజ్యాంగ నిర్మాతలు, కుల రహిత, మత రహిత వ్యవస్తను నిర్మించాలన్న అవేశంతో వాస్తవాలను మరచి, ఆదర్శ రాజ్యాంగం నిర్మిస్తే, అది ఆదర్శంగానే అధికార కాకి లెక్కలకు పరిమితమై, సోషలిజం వస్తుందని కలలు కంటే అది "శోష" లిజం గా మారి పోయింది. కుల వ్రుత్తులకు పేటెంట్ హక్కులు లేకపోవడం వలన, ఎదుటివారి లాబసాటి కుల వ్రుత్తులనబడేవాటినైతే స్వీకరించారు కాని, ఎదుటివాడి కులాన్ని మాత్రం స్వికరించలేక పోయారు.ఇంతకంటే పచ్చి అవకాశ వాదం ఎక్కడైనా ఉంటుందా? నిజానికి వ్రుత్తులను బట్టే కులాలు ఏర్పడ్డాయి. అసలు వ్రుత్తే చెయ్యనపుడు ఇంకా కులం అనేది ఎక్కడ ఉంటుంది? కాని ఉంది! ఎందుకంటే కులం అనే దానిన

అమ్మ భాష ! . తెలుగు బాష ప్రాముఖ్యత!

Image
అమ్మ భాష ! . తెలుగు బాష ప్రాముఖ్యత సాహిత్యం లోకి ప్రవేశించేముందు భాష అంటే ఏంటి? అది ఎలా పుట్టింది? వంటి విషయాలు కూడా తెలుసుకుని ఆ తర్వాత సాహిత్యంలోకి ప్రవేశించడం ఎంతైనా అవసరం. దాంతోపాటు మన మాతృభాష పుట్టు పూర్వోత్తరాల గురించి తెలుసుకోవలసిన ఆవశ్యకత కూడా మనకుంది కాబట్టి తెలుగు భాష ఎలా ఆవిర్భవించిందీ వంటి విషయాలను కూడ తెలుసుకుని ఆ తర్వాత అసలైన సాహిత్యంలోకి అడుగుపెడదాం. ముందుగా…. భాష అంటే ఏంటి? మనసులోని భావనను బహిర్గతపరచే సాధనం భాష. స్పష్టమైన ఉఛ్చారణతో అభిప్రాయాన్ని ఎదుటి వ్యక్తికి అర్ధమయ్యేట్లు చెప్పగలగడమే భాషకు నిర్వచనం. భాషకు మాటలతో అవసరం లేదు. సైగల ద్వారా అభిప్రాయాన్ని తెలియజేయడం కూడా భాషే అవుతుంది. ఐతే మానవ జాతి ఆవిర్భావం నాటికీ, ఆధునిక మానవుని ఆవిర్భావం నాటికీ మనిషి అవసరాలలో పెరిగిన మార్పులు, అభిప్రాయ వ్యక్తీకరణలో చోటుచేసుకున్న ఉత్సాహం, ఉత్సుకత, భావోద్వేగాల సమ్మేళనం మాటల ఆవిర్భావానికి కారణభూతమయ్యింది.విశ్వావిర్భావ క్రమంలో ఇదో అద్భుతం. భాష పుట్టకముందున్న మనిషి మనుగడకీ,భాషల ఏర్పాటు తర్వాత మనిషి మనుగడకీ చేతల్లో కొలవలేనంత వ్యత్యాసముంది. అది ఆధునిక మానవునిచే అత్యద్భుత విన్యాస

ఏదో తీరని బాధ !

Image
ఏదో తీరని బాధ ! . కరగునులే తారకలు ..మోముదాచె రేరాజు రగులునె నా మదిలో ఏదో తీరని బాధ ప్రియతమా

|| మానస వీణ||

Image
|| మానస వీణ|| … ఏ రాగమో ఏమో మన అనురాగం వలపు వసంతాల హృదయ సరాగం… ఎదలోయలలో నిదురించిన నా కోరిక పాడేకోయిల గీతం… శతవసంతాల దశ దిశాంతాల సుమ సుగంధాల భ్రమర నాదాల కుసుమంచు నీ అందమే… మెరిస ంది అరవందమెైకురిస ంది మకరందమే! జాబిలి కనాా.. నా చెలి మనా పులక ంతలకేపూచిన పొ నా… కానుకలేమ నేనివవగలను కనుాల కాుకక నేనవవగలను… పాల కడలిలా వెనెాల పొంగింది పూల పడవలా నా తనువూగింది… ఏ మలలె ల తీరాల నిను చేరగలను మనసున మమతెై కడ చేరగలను… . కురిసేదాక అనుకోలేదు శాా వణ మేఘమని తడిసేదాక అనుకోలేదు తీరని దాహమని… కలిసేదాక అనుకోలేదు తీయని సేాహమని పెదవ నేనుగా పదము నీవుగా ఎదలు పాడని… . మానస వీణ మధుగీతం… మన సంసారం సంగీతం… సాగరమధనం అమృత మధురం సంగమ సరిగమ సవర పారిజాతం… మానస వీణ మధుగీతం… మన సంసారం సంగీతం… సంసారం.. సంగీతం ( మిత్రులు Sailaja Mithra గారికి చాలఇష్టం అయిన సాహిత్యం.) . -చిత్రం...రాజరవివర్మ

భగవద్గీత సారాంశం 'నారాయణుడు'!

Image
భగవద్గీత సారాంశం 'నారాయణుడు'! . "స్వధర్మజ్ఞాన వైరాగ్య సాధ్యభక్త్యేకగోచరః నారాయణః పరం బ్రహ్మా గీతాశాస్త్రే సమీరితః" . భగవద్గీతకి సారాంశం నారాయణుడు అని ఒక్క అర శ్లోకంలో చెప్పేసారు  గీతా సారాంశాన్ని. మరి ఎలాంటి నారాయణుడు అతడు, "స్వధర్మజ్ఞాన వైరాగ్య సాధ్యభక్త్యేకగోచరః"  భక్తి వల్ల లభించు భగవంతుడు మనకి భగవద్గీతలో కనిపిస్తున్నాడు.  భక్తి అంటే ఏమి ? ప్రేమ. ఎట్లాంటి ప్రేమ ? భగవంతుడి మీద నిష్కలంకమైన ప్రేమ. అంటే ప్రేమించి ఏమిస్తావు తిరిగి అడగకపోయేది ప్రేమ.   మూల్యం అడగకుండా ప్రతి ఫలాన్ని ఆశించకుండా చేసేదేదో దాన్ని ప్రేమ అంటాం. తల్లి తన పిల్లవాడిని వాడు రేపు పెద్దవాడై ఏదో ఉద్దరిస్తాడని ప్రేమ చేయదు.  ప్రేమించ కుండా ఉండలేక తాను ప్రేమ చేస్తుంది, దాన్ని కదా మనం ప్రేమ అనేది. ఎదురు చూడక ప్రతిఫలం ఆశించక చేసేది ప్రేమ.  అట్లాంటి ప్రేమతో ఎవడైతే భగవంతున్ని సేవిస్తాడో దాన్ని భక్తి అంటారు.  అట్లాంటి ప్రేమకు లభించు తత్త్వం అనేది మనకు భగవద్గీతలో కనిపిస్తుంది. . "నారాయణః పరం బ్రహ్మా గీతాశాస్త్రే సమీరితః", అంటే భగవద్గీతలో నారాయణుడే పరమ దైవమ

శ్రీ కైవల్య పదంబుఁ,,

Image
శుభోదయం.! " శ్రీ కైవల్య పదంబుఁ జేరుటకునై చింతించెదన్ లోక ర క్షైకారంభకు, భక్త పాలన కళా సంరంభకున్, దానవో ద్రేకస్తంభకుఁ, గేళి లోల విలసద్దృగ్జాల సంభూత నా నా కంజాత భవాండ కుంభకు, మహానందాంగనాడింభకున్.! భావము: సర్వలోకాలను సంరక్షించేవాడిని, భక్తజనులను కాపాడుటలో మహానేర్పరితనం గలవాడిని, రాక్షసుల ఉద్రేకాలను అణచేవాడిని, విలాసంగా చూసే చూపుతోటే నానా బ్రహ్మాండాలు సృజించే వాడిని, మహాత్ముడైన నందుని అంగన యొక్క కుమారుని (మహానందం దేహంగా గల ఆత్మీయుని) మోక్ష సంపదను అపేక్షించి సదాస్మరిస్తు ఉంటాను. ఇది తెలుగు చేయబడిన భాగవత గ్రంధారంభ ప్రార్థనా పద్యం. ఈ తెలుగసేతను బమ్మెర పోతనామాత్యుల వారు తన మోక్షానికే కాదు మనందరి మోక్షాన్ని అపేక్షించి చేసారు. ఇది భాగవతానికే కాదు, తెలుగు సాహితీ విశ్వానికే మకుటాయమాన మైంది. ఇష్టదేవతా స్తుతీ, వస్తు నిర్దేశమూ కల ఈ మనోజ్ఞవృత్తం మహాభాగవతంలోని ఇతివృత్తాని కంతా అద్దం పడుతుంది. శార్దూలవిక్రీడిత వృత్తం ఎన్నుకోడంలో విషయ గాంభీర్యత సూచింపబడుతోంది. స్తుతి, నిర్దేశాలను పలికించే పద విన్యాసం బహుళార్థ సాధకత, దీర్ఘకాల రమ్యత సాధిస్తున్న సూచన కావచ్చు. (అ) శ్రీ కైవల్య పదఁబు జేరుటకునై చింతించ

_కేరళలో పురావస్తు తవ్వకాలో బయటపడ్డ అపురూలపమైన హనుమంతుడి విగ్రహం!

Image
శుభోదయం.! _కేరళలో పురావస్తు తవ్వకాలో బయటపడ్డ అపురూలపమైన హనుమంతుడి విగ్రహం! శ్రీఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రబాధివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం భజేవాయుపుత్రం భజే వాలగాత్రం భజేహం పవిత్రం భజే సూర్య మిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం బటంచున్ ప్రభాతంబు సాయంత్రమున్ నీనామసంకీర్తనల్ జేసి నీ రూపు వర్ణించి నీమీద నే దండకం బొక్కటిన్ జేయ నీ మూర్తిగావించి నీసుందరం బెంచి నీ దాసదాసుండనై రామభక్తుండనై నిన్ను నేగొల్చెదన్ నీ కటాక్షంభునన్ జూచితే వేడుకల్ చేసితే నా మొరాలించితే నన్ను రక్షించితే అంజనాదేవి గర్భాస్వయా దేవ నిన్నెంచ నేనెంతవాడన్ దయాశాలివై జూచితే ధాతవై బ్రోచితే దగ్గరన్ నిల్చితే తొల్లి సుగ్రీవుకున్ మంత్రివై స్వామి కార్యార్దమై యేగి శ్రీరామ సౌమిత్రులన్ జూచి వారిఁవిచారించి సర్వేశు బూజించి యబ్బానుజుం బంటు గావించి యవ్వాలినిన్ జంపించి కాకుత్త్స తిలకున్ దయాదృష్టి వీక్షించి కిష్కిందకేతెంచి శ్రీరామ కార్యార్దమై లంక కేతెంచియున్ లంకినిన్ జంపియున్ లంకనున్ గాల్చియున్ యభ్భుమిజన్ జూచి యానందముప్పొంగి యాయుంగరంబిచ్చి యారత్నమున్ దెచ్చి శ్రీరాముకున్నిచ్చి సంతుష్టునింజేసి స

అత్త లక్ష్మి వ్రతం.!

Image
                                           అత్త లక్ష్మి వ్రతం.!

జలపాతపు జల్లు !

Image
జలపాతపు జల్లు ! జలపాతపు జల్లు లో ప్రేమికులు మాట రాని వూసులు ఎన్నో చెప్పుకుంటే , భగ్న ప్రేమికులును అదే జలపాతం దూకమని కవ్విస్తుంది . పయ్యెద సద్దుకుంటున్న ప్రకృతి కాంత కవ్వింతను చూసి మురిసి పోయే వన పురుషుడిలా . x

రాజమాత! (భోగిని దండకం .. పోతనామాత్యుడు.)

Image
రాజమాత! (భోగిని దండకం .. పోతనామాత్యుడు.) . "అమ్మా! విన న్నొల్లఁ బొమ్మా, విచారించు కొమ్మా, భవన్నీతి దుర్నీతి, సన్మానుషం బింతయున్ లేని  దుర్మానసశ్రేణి నీవేల యీవేల భూషించెదే? యేమి భాషించెదే? యేల నన్నుం బ్రమోషిచెదే?  (చిత్రం...రాజారవివర్మ.)

నా గూడు !

Image
                                                                         నా గూడు !

దేవి ...శ్రీ దేవి !

Image
                                 దేవి................ ...శ్రీ దేవి !

గురుకుల విద్యాభ్యాసం !

Image
                                                  గురుకుల విద్యాభ్యాసం !

మోకాళ్ళపై కూర్చుని, పువ్వందించే .... సీను

Image
ప్రేమించడం ఇష్టం కష్టం మాత్రం, మోకాళ్ళపై కూర్చుని, పువ్వందించే .... సీను Chandra Shekhar Vemulapally..గారి కవిత.

నానబోసిన సెనగలను..

Image
శ్రావణమాసంలో నోములు నోచుకునే వారు, నానబోసిన సెనగలను... ఇరుగు పొరుగువారికి, పిల్లలకు, పేరంటాలకు పంచుతారు.  మొలకెత్తే సెనగల్లో పోషక విలువలు పుష్కలంగా వుంటాయి. వీటిలో " విటమిన్ - ఎ ", “ విటమిన్ -బి కాంప్లేక్స్", “ విటమిన్ - సి ", “ విటమిన్ - ఇ " వుంటాయి.  ఈ విధంగా శ్రావణమాసం ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు ప్రసాదిస్తుంది. మాకు చెన్నా బాటూర ప్రసాదిస్తుంది. తరువాత  శ్రావణ మాసాం సెనగలు కు  ధామ్ ధామ్ బాంబులు కు  కడుపు నొప్పి బాధలకు  డాక్టర్ గారి బిల్లులకు  జై జై జై జై జై జై జై జై !

ఓణం!

Image
ఓణం! ఓణం ఆధునిక కాలంలో కూడా ఇంకా జరుపుకొనే ఒక ప్రాచీన పండుగ. మలయాళ మాసం చింగంలో వచ్చే కేరళ యొక్క వరికోత పండుగ మరియు వర్షపు పువ్వుల పండుగ, పాతాళం నుండి మావెలి రాజు యొక్క వార్షిక ఆగమనాన్ని వేడుకగా చేసుకుంటాయి. చరిత్ర పూర్వం నుండి కేరళ ప్రజలు మవేలి చక్రవర్తిని పూజించటం మూలంగా ఓణం ప్రత్యేకమైంది. చరిత్ర ప్రకారం, మహాబలి పాలించిన సమయం కేరళ కు కు స్వర్ణ యుగం. ఆ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ సుఖంగా మరియు సిరిసంపదలతో ఉన్నారు మరియు ఆ దేశ ప్రజలందరూ తమ రాజుని చాలా గౌరవించేవారు. మహాబలి కి తన సుగుణములన్నింటితోపాటు ఒక లోపం ఉంది. అతను అహంభావి. అయినప్పటికీ, మహాబలి చేసిన మంచి పనులన్నింటికీ మెచ్చి, తనతో ఎంతో అనుబంధం ఉన్న తన ప్రజలను సంవత్సరానికి ఒకసారి కలుసుకునేటట్లు దేవుడు అతనికి వరమిచ్చాడు. మహాబలి యొక్క ఈ ఆగమనమునే ప్రతి సంవత్సరము ఓణం పండుగగా జరుపుకుంటారు]. ప్రజలు ఈ పండుగను చాలా ఘనంగా జరుపుకుంటారు మరియు తమ ప్రియమైన రాజుకి తాము సంతోషంగా ఉన్నామని చెప్పుకుని అతనికి శుభాభినందనలు తెలియజేస్తారు. కేరళ యొక్క ఘనమైన సంస్కృతీ వారసత్వం ఈ పదిరోజుల పండుగ సమయంలో దాని ఉత్తమ రూపుతో మరియు ఆత్మతో బయటకు వస్తుంది. తిరుఓ

జగన్మోహిని అమృతము పంచుట !

Image
జగన్మోహిని అమృతము పంచుట ! .  ఆ జగన్మోహినీదేవి మెరుగారు చూపులూ, చల్లని పలుకులూ, బుజ్జగింపులూ కట్టుతాళ్ళలా సాగి సాగి రాక్షసుల నోళ్ళను కట్టేశాయి.  రాక్షసులు అందించిన, అమృతకలశాన్ని, మాయా సుందరి మోహినీ రూపంలో ఉన్న విష్ణుమూర్తి తన చేతులలోకి తీసుకున్నాడు.  చిరునవ్వులు చిందే పలుకులతో “నేను పంచిపెట్టిన విధంగా ‘ఔను’ ‘కాదు’ అనకుండా ఒప్పుకోవాలి” అన్నాడు.  ఆ షరతులకు అంగీకరించిన రాక్షసులూ, దేవతలూ “సరే” అన్నారు.  వారందరూ ఉపవాసం ఉండి స్నానాలు చేసి హోమాలు ఆచరించారు. బ్రాహ్మణులకు గోదానాలు, భూదానాలూ, హిరణ్యదానాలూ మున్నగు దానాలు ఇచ్చి, వారి ఆశీర్వచనాలు అందుకున్నారు.  తెల్లని బట్టలు కట్టుకున్నారు. చందనం పూతలూ, పూలమాలలూ, ధూపాలూ, దీపాలూ అలంకరించిన బంగారు మండపంలో చేరారు.  తూర్పుకు కొసలు ఉండేలా పరచిన దర్భాసనాల మీద తూర్పుముఖంగా వరుసలు కట్టి కూర్చున్నారు. అప్పుడు, కటిభారంతోనూ, స్తనాలభారంతోనూ, శిరోజాలభారంతోనూ చిక్కిన చక్కనమ్మ జగన్మోహిని, తన పద్మం వంటి చేతిలో అమృతకలశాన్ని పట్టుకుని ఒయ్యారంగా వచ్చింది. ఆమె ధరించిన రకరకాల ఆభరణాలు సవ్వళ్ళు చేస్తున్నాయి.  ఆ మోహినీ అవతారం, ధరించిన కర్ణాభరణాల తళత

జయ జయ దేవ హరే ...జయ జయ దేవ హరే....

Image
మధు ముర నరక వినాశనా......గరుడాసనా.......ఈ సురకుల కేళి నిదానా  . జయ జయ దేవ హరే ...జయ జయ దేవ హరే....

ఏదో ఏదో అన్నది ఈ మసక వెలుతురు!

Image
ఏదో ఏదో అన్నది ఈ మసక వెలుతురు! . ఏదో ఏదో అన్నది ఈ మసక వెలుతురు గూటి పడవలో విన్నది కొత్త పెళ్ళికూతురు ..... ఏదో ఏదో అన్నది ఈ మసక మసక వెలుతురు గూటి పడవలో విన్నది కొత్త పెళ్ళికూతురు ఒదిగి ఒదిగి కూచుంది బిడియపడే వయ్యారం ముడుచుకొనే కొలది మరీ మిడిసిపడే సింగారం సోయగాల విందులకై వేయి కనులు కావాలీ ..... హ్మ్మ్మ్ మ్మ్మ్ మ్మ్ ఏదో ఏదో అన్నది ఈ మసక వెలుతురు గూటి పడవలో విన్నది కొత్త పెళ్ళికూతురు నింగిలోని వేలుపులు ఎంత కనికరించారో నిన్ను నాకు కానుకగా పిలిచి కలిమినొసగేరు పులకరించు మమతలతో పూల పాన్పు వేసారు హ్మ్మ్మ్ మ్మ్మ్ మ్మ్ ఏదో ఏదో అన్నది ఈ మసక మసక వెలుతురు గూటి పడవలో విన్నది కొత్త పెళ్ళికూతురు . ఈ పాట డెభ్భై ఎనభై దశకాల్లో వచ్చిన అపురూపమైన పాటల్లో మొదటిదని నా నమ్మకం. సాహిత్యం ఎంత నిండుగా ఉంటుందో ఈ పాటలో. ప్రేమ,ఇష్టం,సున్నితమైన శృంగారం వీటన్నింటితో చక్కటి మేళవింపు ఈ పాట. "ముడుచుకునే కొలదీ మరీ మిడిసిపడే సింగారం". ముడుచుకోవటం, మిడిసిపడటం రెండూ ఒకదానికొకటి భిన్నమైనవి. ఆ రెంటినీ కలిపి ఒకచోట కూర్చి అపురూపం అనిపించిన ఆ రచయిత శైలి కి జోహార్లనద్దూ. :) సినిమా

ఛీర్' కొడదామా? 'ఛీఁ!' కొడదామా?

Image
ఛీర్' కొడదామా? 'ఛీఁ!' కొడదామా? ( ఓ సరదా గల్పిక) గెలీలియో నిజంగా మహానుభావుడు. మందుబాబులకన్నా ముందే భూమి గుండ్రంగా తిరుగుతున్నదని కనుక్కొన్నాడు. కథలు చెప్పేవాళ్లందరూ తాగుబాతులని చెప్పలేంకానీ.. తాగుబోతులుమాత్రం మంచి కథకులై ఉంటారు. కొంపకు ఆలస్యంగా వచ్చినప్పుడల్లా ఇంటిఇల్లాలుకి కొత్తకథ అల్లి చెప్పాలంటే అల్లాటప్పా వ్యవహారం కాదు! తప్పతాగితే తప్ప అంత సృజనాత్మకత సాధ్యం కాదు. మందేమీ ఇప్పుడు కొత్తగా కనిపెట్టిందికూడా కాదు. రామాయణకాలంలో- సీతమ్మవారిని వెతకడానికని వెళ్ళిన ఆంజనేయుడుకి లంకలో ముందుగా కనిపించింది ద్రాక్షారసాలు సేవించే రాక్షసులే! భారతంలోని కీచకుడుకి మగువలమీదకన్నా మధ్యపానంమీద మక్కువ జాస్తి. ఉజ్జయినీ కాళీమాతకు మద్యమే నైవేద్యం. శిప్రానదీ తీరాన కొలువైన భైరవుడు నాటుసారా తప్ప మరొకటి ముట్టడు. దేవదానవులు దెబ్బలాట దేనికోసం? ఆ సురేకదా నేటి సారాయి! మదిరలో ఎంత మహత్తు లేకపోతే గాలిబ్ అంత గమ్మత్తైన గజల్సు చెప్పగలడు! అజంతా హరప్పా శిథిలాలు తవ్వితీసినప్పుడూ ముందుగా బైటపడ్డవి అప్పటి తాగుబోతులు తాగిపారేసిన చట్లూ పిడతలేనంటారు. నిప్పు కనిపెట్టకముందు ఆదిమానవుడు ఎండావానలకు, చలిగాడ్పులకు

శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే

Image
శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే రామనామ వరానన ఓం నమ ఇతి కల్మషమైన చిత్తము, పాపిష్టి సంపాదనతో జీవించడం, ఆచరించవలసిన కర్మలను నిర్వర్తించకపోవడంతో పాటు నిషిద్ధ కర్మలకు పాల్పడడం మనుష్యులకు దుఃఖాన్నిస్తాయి. అయితే తరుణోపాయం ఉంది. భక్తిరేవ గరీయసీ! భక్తి ఒక్కటే మార్గం. అందుకే శ్రీ సదాశివ బ్రహ్మేంద్రులు "పిబరే రామరసం ... - ఓ జిహ్వా, రామరస పానం చేయవే" అని ఉపదేశించారు. భగవన్నామ సంకీర్తన అన్నప్పుడు శ్రీ రామనామమే ఎందుకు జ్ఞాపకం వస్తుంది? శ్రీరామ శబ్దం జగత్తులొనే మొట్టమొదటి మంగళకరమైన శబ్దమని కాళిదాసు మహాకవి అన్నాడు. ఔషధం ఆరోగ్యాన్ని ఇస్తుంది. అమృతం అమరజీవనం ఇస్తుంది. శ్రీరామనామామృత పానంతో అమరత్వం సిద్ధిస్తుంది. అసలు శ్రీరామతత్త్వం మన మనసులోనే ఉంది. అష్టాక్షరి (ఓం నమోనారాయణాయ) లో "రా" శబ్దము, పంచాక్షరి (ఓం నమశ్శివాయ) లో "మ" శబ్దం తీసుకోగా రామశబ్దం ఏర్పడింది. రేడు మంత్రాలలొని శక్తిని కలుపుకున్న శక్తి రామనామానికి ఉంది. అంతేకాదు, శ్రీరామనామం త్రిమూర్త్యాత్మకమైనది. రామశబ్దం అద్వైతపరంగా కూ

ఆలోచనలో అమ్మయి...... ప్రేమ లేఖ అంత సులభం కాదు!

Image
ఆలోచనలో అమ్మయి...... ప్రేమ లేఖ అంత సులభం కాదు!

రవి వర్మకి అందలేదు... బాపుగారి అందిన అందం.!

Image
                రవి వర్మకి అందలేదు... బాపుగారి అందిన అందం.!

వర్ణనాతీతం :)

Image
వర్ణనాతీతం :) . “గసగసాల కౌగిలింత గుసగుసల్లె మారుతావు”

నీరీక్షణ !

Image
నీరీక్షణ ! . ఓదిగి ఓదిగులి కూర్చుంది బిడియపడే వయ్యారం! ముడుచు కొనే కొలది అది మిడిసిపడే.. సింగరం! శొయగల విందకై వెయి కనులు కావలి....

శుభోదయం......తులసి మాత !

Image
శుభోదయం......తులసి మాత ! . శ్రీ తులసి ప్రియ తులసి జయమునియ్యవే జయమునియ్యవే .. శ్రీ తులసి ప్రియ తులసి జయమునియ్యవే జయమునియ్యవే . సతతము నిను సేవింతుము సత్కృపకనవే సత్కృపకనవే .... . లక్ష్మీ పార్వతి వాణీ అంశలవెలసీ భక్తజనుల పాలించే మహిమనలరుచూ శ్రీ తులసి ప్రియ తులసి జయమునియ్యవే జయమునియ్యవే .. శ్రీ తులసి ప్రియ తులసి జయమునియ్యవే జయమునియ్యవే . . . వొల్లగ శాఖలు వేసీ.... వెల్లుగ దళముల విరిసీ శుభకర పరిమళములతో మా పెరటివేల్పువై వెలసీ...| శ్రీ తులసి ప్రియ తులసి జయమునియ్యవే జయమునియ్యవే .. శ్రీ తులసి ప్రియ తులసి జయమునియ్యవే జయమునియ్యవే . . దళమునకొక విష్ణువుగా విష్ణుతులసివే...శ్రీకృష్ణ తులసివే... జయహారతిగైకొనవే మంగళ శోభావతివై శ్రీ తులసి ప్రియ తులసి జయమునియ్యవే జయమునియ్యవే .. శ్రీ తులసి ప్రియ తులసి జయమునియ్యవే జయమునియ్యవే .

ఈనాటికి ఈ గజల్ చాలు.. ఇకవుంటా.

Image
                      ఈనాటికి ఈ గజల్ చాలు.. ఇకవుంటా.

శుభరాత్రి ! . పడుకోనిస్తే కదా..

Image
శుభరాత్రి ! . పడుకోనిస్తే కదా..

మూడు గొడ్డళ్ళ కథ!

Image
మూడు గొడ్డళ్ళ కథ! (By - Virabhadra Sastri Kalanadhabhatta) . ఒకడు నదిమీదకు వంగి వున్న కొమ్మను గొడ్డల్తో కొడుతూవుండగా, గొడ్డలి జారి నదిలో పడింది. వాడు విచారిస్తూవుంటే నది దేవత ప్రత్యక్షమై విషయం తెలుసుకొని, నదిలోకి మునిగి, ఒక బంగారు గొడ్డలి తెచ్చి ఇది నీదేనా అని అడిగింది. కాదన్నాదు. మళ్ళీ నదిలోకి మునిగి, ఈసారి వెండి గొడ్డలి తెచ్చి ఇది నీదేనా అని అడిగింది. కాదు అన్నాడు. మూడోసారి మునిగి వాడి గొడ్డలినే తెచ్చి ఇది నీదేనా అని అడిగింది. ఆ! ఇదే నాది అన్నాడు సంబరపడిపోతూ. వాడి నిజాయితీకి మెచ్చుకొని బంగారు, వెండి గొడ్డళ్ళు కూడా వాడికి ఇచ్చింది. వాడు ఆనందంగా వాటిని తీసుకు ఇంటికి వెళ్ళాడు.  *** *** *** రాజు అతని భార్య ఒక చల్లటి సాయంత్రం (బహుశా శీతాకాలం అయివుంటుంది. ఈ వేళ అయితే 46 డిగ్రీలు) విజయవాడ బ్యారేజీమీద షికారుకుచేస్తూ, పల్లీలు కొనుక్కుని నముల్తూ కబుర్లు చెప్పుకుంటు నడుస్తున్నారు. రాజు భార్య బ్యారేజీ ప్రక్కనవున్న రైలింగు మీదనుంచి నదిలోకి తొంగిచూస్తోంది. రాజు ఏదో విట్ వేసాడు. పకపకా నవ్వుతూ హమ్మ అబ్బ అంటూ నవ్వలేక మెలికలు తిరిగిపోతూ ఆవూపులో కృష్ణా నదిలో పడిపోయింది. రాజు లబో దిబో మన్న