...పేర్ల మార్పు...

...పేర్ల మార్పు...

.

రాజమంద్రం పేరు మార్చారు, విజయవాడ పేరు మారుస్తారా అన్నాడో మిత్రుడు. మార్చాలసిందే .....బెజవాడ అని అన్నాడింకో మిత్రుడు. మారిస్తే,

"బెజ్జం వాడ" (కనక దుర్గమ్మ ముక్కు నత్తు తో బెజ్జం చెయ్యగా,

కొండలని చీల్చుకొని ప్రవహించింది కృష్ణ వేణి.)

అప్పుడే తన ముక్కెర కోల్పోయింది దుర్గ. కలియుగాంతానికి మాత్రమే 

కృష్ణమ్మ పొంగి, తన ముక్కెర తగిలిస్తుంది లెమ్మని ఆవిడ వరం ఇవ్వడంతో, 

అక్కడ ఏర్పడింది బెజ్జం వాడ. 

.

పోనీ, అంత సాహసం చేయలేకపోయినా, ఇబ్రహీం పట్నం ఏమిటండీ బొత్తిగా!

దాన్ని, ఇంద్రకీల పట్టణం అనో ఏదో మార్చ వచ్చుఁ గా? 

(దాని మీదా ఏ బి కె ప్రసాద్ కోర్టుకి వెళతాడేమో.... వెళ్లనివ్వండి.) 

మళ్ళీ తలంటించు కుంటాడు!

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!