అసూయ అను నీతికధ !

అసూయ అను నీతికధ !

.

పూర్వ కాలం ఇద్దరు బద్ధ శత్రువులు ఒక అడవిలో రెండు వేర్వేరు చెట్ల కింద కూర్చొని తపస్సు చేసుకుంటున్నారు. మరి వాళ్ళు తపస్సు మొదలుపెట్టిన గంటకో రోజుకో, వారానికో నెలకో మొత్తంమీద కొంత కాలానికి ప్రకృతిలో భరింపరాని వేడి పుట్టింది. (ప్రస్తుతం విజయవాడలో ఎండ 45-46 డిగ్రీల మధ్య మండిపోతోంది)

ఈవేడి అలా అలా పైకి ప్రాకుతూ ఆకాశాన్నంటిన నిత్యావసర వస్తువుల ధరలను కూడా దాటి బ్రహ్మలోకాన్ని తాకింది. బ్రహ్మగారికి వళ్ళు మండింది. వెంటనే తపస్సుచేసుకునే ఒకడిముందు ప్రత్యక్షమై బాబూ నీకు పుణ్యం వుంటుంది కళ్ళు తెరిచి ఏంవరం కావాలో కోరుకో అన్నారు. వాడు కళ్ళు తెరిచి స్వామీ వచ్చారా! నేను మీటైం వేస్టు చెయ్యను. మీకు టూకీగా ఒక నమస్కారం. ఇక వరం మాట అంటారా అదిగో ఆచెట్టుకింద కూర్చుని తపస్సు చేసుకుంటున్నాడే వాడి దగ్గరకు మీరు ఎలాగూ వెళ్తారుగనుక, వాడేం కోరితే దానికి రెట్టింపు నాకు ప్రసాదించండి అని వేడుకున్నాడు. వెంటనే బ్రహ్మగారు ఇక్కడ ఫేడౌటై అక్కడ రెండోవాడిదగ్గర ప్రత్యక్ష మయ్యారు. వత్సా నీతపస్సుకి మండిపోతున్నాం. కనుక దయవుంచి కళ్ళు తెరిచి నీకేం వరం కావాలో కోరుకో అన్నారు.

అతగాడు కళ్ళు తెరిచి బ్రహ్మగారికేసి చూసి హలో అని నమస్కారం పెట్టి, స్వామీ నేను డైరెక్ట్ గా పాయింట్ లోకి వస్తాను. నాకు వరం ఇచ్చేముందు అక్కడవున్నాడే ఆనస్మరంతిగాడు, వాడికే వరం ఇచ్చారో చెప్తే అప్పుడు నాకోరిక చెప్తాను అన్నాడు.

నాయనా మీరిద్దరూ పెద్ద పొలిటీషియన్లుగా వున్నారు. అతగాడు నీవేంకోరితే దానికి రెట్టీంపు ఇమ్మన్నాడు అన్నారు.

అలాగా! అయితే స్వామీ నాకు ఒక కన్ను పోగొట్టండి అని వరం కోరుకున్నాడు

ఇప్పుడు తమకు విషయం అర్ధం అయిందనుకుంటా.

*** *** ***

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!