కొలువు1 (కొలువు గూర్చి మూడు సుమతి పద్యాలు .)

కొలువు1
(కొలువు గూర్చి మూడు సుమతి పద్యాలు .)
.
అడిగిన జీతం బియ్యని
మిడిమేలపు దొరను గొల్చి మిడుగుట కంటెన్
వడిగల ఎద్దులఁ గట్టుక
మడి దున్నుక బ్రతుకవచ్చు మహిలో సుమతీ !
.
ఓ సుమతీ.! సమయానికి జీతమివ్వక పోగా అవసరమొచ్చిందని అడిగినా జీతం ఇవ్వని మిడిసిపాటు గల యజమానిని సేవించడం కంటే మంచి ఎడ్ల జతను కూర్చుకొని , వ్యవసాయం చేసుకొని బ్రతకడమే ఉత్తమమైన పని.
.
అడియాస కొలువుఁ గొలువకు
గుడిమణియము సేయబొకు కుజనుల తోడన్
విడువక కూరిమి సేయకు
మడవినిఁ దోడరయకొంటి నరుగకు సుమతీ !
.
ఓ మంచి బుద్ధిగలవాడా! ఒక మాట అనుకోకుండా ఎంతో కొంత ఇస్తారులే అనో , ఎప్పటికో అప్పటికి శాశ్వతమౌతుందనో ఆశ పడి ఉద్యోగం లో చేరడం , దేవాలయాధికారిగా పెత్తనం చేయడం , చెడ్డవారి తో స్నేహం చేయడం , అడవి లో తోడులేకుండా ఒంటరి గా ప్రయాణం చేయడం అనేవి మంచివి కావు . అనగా బుద్ధిమంతుడు ఆచరించ దగ్గవి కాదు
..
అధరము గదలియుఁ గదలక
మధరములగు భాష లుడిగి మౌనవ్రతుడౌ
నధికార రోగపూరిత
బధిరాంధక శవముఁ జూడఁ బాపము సుమతీ !
.
ఓ సుమతీ ! పెదవి కదిలీ కదలనట్లు అంటే మాట వినబడీ వినబడనట్లు మాట్లాడుతూ , మౌనాన్ని పాటిస్తూ , అధికారమనే రోగము చే నిండిన అధికారిని చూడటం చెవిటి ,గుడ్డి శవాన్ని చూసినంత పాపము.x

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!