జీవితం (1949 సినిమా)..

జీవితం (1949 సినిమా)..

(హిందీ లో బహార్)

.

తారాగణం:--

టి.ఆర్.రామచంద్రన్ (పతి),

సి.హెచ్.నారాయణరావు (మూర్తి),

వైజయంతిమాల (మోహిని),

యస్.వరలక్ష్మి (వరలక్ష్మి),

సి.యస్.ఆర్.ఆంజనేయులు,

కంచి నరసింహారావు

.

సంగీతం ఆర్.సుదర్శనం

నేపథ్య గానం యస్.వరలక్ష్మి, ఎమ్.ఎస్.రామారావు

గీతరచన వెంపటి సదాశివబ్రహ్మం

సంభాషణలు తోలేటి వెంకటరెడ్డి

నిర్మాణ సంస్థ ఎ.వి.యం.ప్రొడక్షన్స్

జీవితం ఏ.వి.యం.ప్రొడక్షన్స్ వారు 1949 లో తెలుగు, తమిళ, హిందీ భాషలలో ఎం.వి.రామన్ దర్శకత్వంలో నిర్మించిన మొదటి చిత్రం. ప్రముఖ నటి వైజయంతిమాలకు ఇది తొలి తెలుగు చిత్రం.

సంక్షిప్త చిత్రకథ....

వరలక్ష్మికి ఒక ముసలాయనతో పెళ్ళి జరగడం ఇష్టం లేక ఆత్మహత్య చెసుకోబోతుంది. ఇంతలో మూర్తి అడ్డుపడి తాను పెళ్ళిచేసుకొంటానని బాస చేసి ఆమెను లొంగదీసుకొని, కడుపొచ్చిన తరువాత పారిపోతాడు. వరలక్ష్మికి మగపిల్లాడు పుడతాడు. మూర్తిని వెతుక్కొంటూ మద్రాసు వస్తుంది వరలక్ష్మి. పతి మద్రాసులో నిజాయతీగా గుమస్తా పని చేసే ఉద్యోగి. పతి, మోహిని పరస్పరం ప్రేమించుకొంటారు. ఒక చోట వరలక్ష్మికి మూర్తి కనపడతాడు. కానీ వరలక్ష్మిని గుర్తించడానికి నిరాకరించి ఆమెను కులట అని నిందిస్తాడు. దానితో వరలక్ష్మి జీవితం చాలించదలిచి, పిల్లాడిని మూర్తి కారులో వదిలేస్తుంది. కారు వెళ్ళిపోయిన తరువాత పిల్లాడి మీద మోహంతో ఆత్మహత్య చేసుకోలేకపోతుంది. అనాధగా పడున్న పిల్లాడిని మూర్తి సాకుతూంటాడు పతి. మోహినిని పెళ్ళిచేసుకోదలచిన మూర్తి, పతికి ఇది వరకే అక్రమ సంబంధం ఉందని, దాని ఫలితమే ఈ పిల్లాడని మోహినిని నమ్మిస్తాడు. కానీ వరలక్ష్మి అమాయకత్వం, నిజాయితీ మూర్తిని మారుస్తుంది. ఇరి జంటకు కలవడంతో కథ సుఖాంతం అవుతుంది...

పాటలు......

మేలుకోండి తెల్లవారె తెల్లగా - ఎస్.వరలక్ష్మి

ప్రియమైన రాణీ మోహినీ

మన మనసూ మనసూ ఏకమై

ఇదేనా మా దేశం, ఇదా భారతదేశం - యం.ఎస్.రామారావు

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!