ఏదో ఒక ఉద్యోగం చేసుకోక ఎందుకొచ్చిన సినిమాల్రా...!

ఏదో ఒక ఉద్యోగం చేసుకోక ఎందుకొచ్చిన సినిమాల్రా...!

వందలో

ఏ ఒక్కడో పైకొస్తాడు . ఎప్పుడు పడతారో తెలియదు ఎప్పుడు

లేస్తారో తెలియదు,అంతా స్ట్రగులే కదరా.మీ అన్నకు 70

వేలు జీతం,నీకన్నా చిన్నవాడికి 40 వేలు,నన్ను చూడు రిటైర్

అయ్యాక మూడంతస్తుల బిల్డింగ్ కట్టుకున్న.మేమంతా ఎంతో

"ఆనందం"గా వున్నాం.నువ్వు....ఇంత చిన్న గదిలో,ఒకపూట

తిని...ఇంకోపూట తినక,గడ్డాలు పెంచుకుని, అందరికీ దూరంగా,ఏ

ఆనందం లేకుండా ఎందుకురా " అని అడిగితే నేను సమాధానం కూడా

చెప్పలేదు.

జీవితాన్ని డబ్బుతో మాత్రమే తూకం వేసే ఆయనకు మా

సినిమావాళ్ళ ఆనందాల గురించి తెలియకపోవడం లో తప్పేమీ

లేదు.

అవును అంతా స్ట్రగు లే..కాని..

రొటీన్ గా కాకుండా కొత్తగా ఆలోచించడంలోని ఆనందం,ప్రతిరోజూ

కొత్త పని చేయడంలోని ఆనందం,ఒక్కపూట తిన్నా నా

ప్రపంచంలో వుండటంలోని ఆనందం,చిన్న గదిలో వున్నా నా సినీ

పరిశ్రమకు దగ్గరగా వుండటంలోని ఆనందం,ఫ్లాప్ వస్తే

హిట్టు కోసం పడే తపనలోని ఆనందం ,హిట్టు

వస్తే దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నంలోని ఆనందం,

ఇంకా ఏదో సాధించాలనే ఆశతో ప్రతిక్షణం రగిలే నాకు ఇంకా ఎన్ని

ఆనందాలు ఉన్నాయో అవన్నీ మీ మూడంతస్తుల మేడలో లేవని

ఆయనతో చెప్పాలనుకున్నా .. కానీ "నేను మా సినిమా వాళ్ళతో

తప్ప మిగిలిన మనుషులతో మాట్లాడటం దాదాపుగా మానేసాను."

"""చరిత్ర పుటల్లో తన పేరు తో ఒక్క వాక్యమైన

వ్రాయబడాలని కోరుకునే కళాకారుడికి కష్టం కూడా ఇష్టం గానే

ఉంటుంది.""""

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!