మంగళ సూత్రములు !

మంగళ సూత్రములు !

మ.) 

దళమౌ పయ్యెదలో నడంగియు సముద్యత్కాంతు లీరెండలన్‌

మలియింపన్‌ దిశలన్‌ ద్వదీయ గళసీమన్‌ బాలసూర్యప్రభా

కలితంబై వెలుగొందుచున్నదది మాంగల్యంబు కాఁబోలు! నే

వెలకైనం దెగనమ్మి నీ సుతునకై వెచ్చించినన్‌ జెల్లదే?

ఈ పద్యం నాకు చాలా ఇస్తమ్.

.

కాలకౌశికుని ఇంట దాసిగా చంద్రమతి,

వీరబాహుని సేవకునిగ వీరదాసు అను పేరుతో హరిశ్చంద్రుడు కుదిరినారు. చితుకలు తెచ్చుటకు కాలకౌశికుని శిష్యులతో అడవికి వెళ్లిన లోహితాస్యుడు పాము కాటుకు మరణించును. పని పూర్తగు వరకు కదలరాదని కాలకౌశికుని భార్య ఆజ్ఞాపించుటతో అర్ధరాత్రి వరకు ఇంటి పనులు చేసి పిమ్మట చంద్రమతి కుమారుని తీసుకొని హరిశ్చంద్రుడు కావలిగా ఉన్న సశ్మానమునకు కొని వచ్చి శవదహనము నకు పూనుకొనును. హరిశ్చంద్రుడు అది గమనించి కాటి సుంకము చెల్లింప కుండా శవదహనము కానింప రాదని గద్దించును. తన వద్ద సొమ్మేమి లేదనగా నగనేదైనా అమ్మి కాటిసుంకం చెల్లింప మనును. 

అంతట హరిశ్చంద్రుడు ఆమె మెడలో ఉన్న మాంగళ్యాన్ని ఏ ధరకైనా అమ్మమనును. వసిష్ఠుని వరము వలన భర్తకు దక్క తన మాంగల్యము ఎవరికి కనిపించదని, అందు చేత ఆమె అతని భర్త హరిశ్చంద్రుని గా గుర్తించును. ఇద్దరూ కుమారుని మరణమునకు వగచి, ఆమె యజమానురాలిని అడిగి సొమ్ము తీసుకురమ్మని హరిశ్చంద్రుడు పలుకును.

.

మంగళ సూత్రములు బయటకు కనిపించ కూడదు, భర్తకు తప్ప అది అన్యులకు కనిపించ రాదు....భర్తకు అమంగళం....ముత్తైదువులు ఈ విషయాన్ని గట్టిగా పాటించాలి.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!