ఇప్పుడూ, ఎప్పుడూ కావలసింది..... "మత ప్రసక్తి లేని..... "!

కొందరు మేథావులు అంటున్నట్టు.... కావలసింది 

"మత రహిత", "కుల రహిత", లేదా.... "మత సహిత ", "కులసహిత" కాదు! అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ కావలసింది..... "మత ప్రసక్తి లేని..... "! 

అది కాంగీ ల వల్లా, కమ్మీల వల్లా అవదు అని తేలిపోయింది. 

ఇంకా మిగిలింది.... "ఫలానా వాళ్ళ" వల్లే.....! చూద్దాం .....!

.

మన దేశంలో కుల నిర్మూలన జరగాలని కలలు కన్న వారు కను మరుగై పోయారు.మన బారత రాజ్యాంగ నిర్మాతలు, కుల రహిత, మత రహిత వ్యవస్తను నిర్మించాలన్న అవేశంతో వాస్తవాలను మరచి, ఆదర్శ రాజ్యాంగం నిర్మిస్తే, అది ఆదర్శంగానే అధికార కాకి లెక్కలకు పరిమితమై, సోషలిజం వస్తుందని కలలు కంటే అది "శోష" లిజం గా మారి పోయింది. కుల వ్రుత్తులకు పేటెంట్ హక్కులు లేకపోవడం వలన, ఎదుటివారి లాబసాటి కుల వ్రుత్తులనబడేవాటినైతే స్వీకరించారు కాని, ఎదుటివాడి కులాన్ని మాత్రం స్వికరించలేక పోయారు.ఇంతకంటే పచ్చి అవకాశ వాదం ఎక్కడైనా ఉంటుందా?

నిజానికి వ్రుత్తులను బట్టే కులాలు ఏర్పడ్డాయి. అసలు వ్రుత్తే చెయ్యనపుడు ఇంకా కులం అనేది ఎక్కడ ఉంటుంది? కాని ఉంది! ఎందుకంటే కులం అనే దానిని వ్రుత్తి నుండి విడదీసి అది ఒక శాశ్వత సామాజిక హోదా గా మార్చాం కాబట్టి!కాబట్టి ఇప్పుడు కులం ను బట్టి వ్రుత్తి చెప్పలేక పోయినా వారి వారి సామాజిక హోదాను అంచనా వెయ్యొచ్చు.అలా అందరి అంటే, అన్ని కులాల సామజిక హోదాను సమానం చెయ్యడమే నిజమయిన సోషలిజం. దీనినే "క్యాస్ట్ సోషలిజం" లేదా "సర్వ వర్ణ సమానత్వం" అని కూడ అనవచ్చు.దీనికి చెయ్యాల్సిందల్లా " కుల నిర్మూలన" కాదు " కుల ఆధిక్యత నిర్మూలన" ముందు చెయ్యాలి. ప్రతి వెనకబడిన కులం వారి సామాజిక స్తితి గతులు, అభివ్రుద్ది చెందిన కులాల వారితో సమం చెయ్యాలి. అప్పుడు "కులo" అనేది దానంతట అదే మాయమవుతుంది.

"కుల వ్యవస్త అనేది ఒక్క రోజుదో, ఒక శతాబ్థం నాటిదో కాదు. అలాగే ఒక నిర్ణీత గడువులో ఇది మాయమైపోదు. పరిణామ క్రమం అనేది దీనికి వర్తిస్తుంది.అప్పటీ వరకు "కులం" అనే ప్రాతి పదికనే అభిరుద్ది పథం నిర్దేశించాలి. కేవలం ఒక పరిణామ క్రమంలో కుల బావనను అంతం అంతం చెయ్యడమెలాగో పాలకులు ఆలోచించాలి. అంతే కాని, వోటు బాంకులు గా వాటిని పరిగణిస్తూ, వాటి మద్య విద్వేషాలు రాజేస్తూ , పైకి కుల రహితులమని చెపుతూ, లోపల కులాలను రెచ్చగొట్టి , పబ్బం గడుపుకోవడానికి చూడటం ఏ మాత్రం క్షమార్హం కాదు.

ప్రపంచం అంతట వర్గ బేదం ఉండ వచ్చు. కాని అది ఈదేశంలో చెల్లుబాటు కాదు. ఇక్కడ కుల సంబందమే ముఖ్యం. కాబట్టి ముందు "కుల సమానత్వం" తెచ్చుకుందాం. దీనికి ఏకైక మార్గం ఒకటుంది. దానిని తర్వాతి టపాలో వివరిస్తాను.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!