Skip to main content
ఆ ముగ్గురు భామల ముచ్చట కధ.!
ఆ ముగ్గురు భామల ముచ్చట కధ.!
.
మీరు నమ్మండి- ఇది నిజం – మా హైకమాండ్ కమిటి సెలక్షన్ పరీక్షల్లో హేమమాలిని, జయలలితను కూడా చూసాం. టెస్టులు తీసాం. వాళ్ళిద్దరూ సినిమాలకి పనికి రారని రూలింగ్ ఇచ్చేశాం!
.
మొన్నటి హేమమాలిని – నిన్నటి డ్రీం గర్ల్ కాదు- సన్నగా చీపురుపుల్లలా చిటికెనవేలు లావుండేది. మాకు రేకు గ్లాసుల్లో టీ ఇచ్చింది. వాళ్ళమ్మగారు కూడా చెప్పారు- చాన్స్ ఇస్తే ఆపిల్సు, బత్తాయి రసం ఇచ్చి పుష్టిగా చేస్తా నన్నారు. ఐనా మేం ఒప్పుకోలేదు.
.
తరువాత హేమ(గారు) అనంతస్వామి అనే లాయరు గారి కాంట్రాక్ట్ ద్వారా డ్రీం గర్ల్ గా రూపు ధరించి ఎదిగి రాజకపూర్ తీసిన ‘సపనోం కీ సౌదాగర్’ చిత్రంతో గొప్ప తార అయింది. ‘షోలే’ లో వసంతి-‘నసంతి’ లాటి వేషాలతో రెండు దశాబ్దాలు(ధర్మేంద్ర) మహారాణిగా ఏలింది. ఇప్పటికీ ఎప్పటికీ ఎవర్ గ్రీన్ స్టారే! తన కూతుళ్ళతో పోటీపడి నాట్యం చేయగల గొప్ప నర్తకి.
.
అలాగే జయలలితకి స్లైయిట్ స్క్వింట్ (అదృష్టం మెల్ల) అన్నారు సెల్వరాజు గారు. ఆమె దరిమిలా తెలుగు తమిళ చిత్రాల్లో సూపర్ స్టార్ అయింది. తమిళనాడు ముఖ్యమంత్రి అయింది. రాజ్జి అయింది.
ప్రమాదో ధీమతామపి.... ఇలాటి తప్పులు పరిశ్రమకి కొత్తకాదు.
మహానటి సావిత్రిని సినిమాలకి పనికిరాదని ఎల్.వి.ప్రసాద్ గారు అభిప్రాయపడ్డారు.
రావుగోపాలరావు వాయిస్ సినిమాకి సూటబుల్ కాదని- ఆనాటి సౌండ్ పండితులు భావించి ఆయన నటించిన పాత్రకి వేరొక గాత్రంతో డబ్బింగ్ రుబ్బించారు.
నాగయ్యగారికి వయసు మళ్ళాక పి.బి.శ్రీనివాస్ తో పాటలు పాడించారు....
20 వ శతాబ్ది వేదం- శ్రీ శ్రీ ‘మహాప్రస్థానం’ కవితను భారతి పత్రిక తిరస్కరించింది.”
.
----- *కోతి కొమ్మచ్చి – బాపు రమణీయం *
Comments
Post a Comment