అయ్యా ! ఇపుడు నేను అదే చేస్తున్నాను!

అయ్యా ! ఇపుడు నేను అదే చేస్తున్నాను!

.


మన్మధరావు ఆ పల్లెటూరుకి కొన్నాళ్ళు తన గెస్ట్ హౌస్ లో సరదాగా కాలక్షేపానికి వెళ్ళాడు .సాయంత్రం అలా నది గట్టుకి వెళ్ళాడు . అక్కడ ఒక చేపల వాడు చేపలు అమ్ముతున్నాడు . నిన్న కూడా అతడి దగ్గర చేపలు కొన్నాడు . చాలా బావున్నాయి . 

అతడిని అడిగాడు 

.

“ఎంత దూరం వెడతావు చేపలు పట్టడానికి ?”

.

“అట్టే దూరం వెళ్ళనండి “

.

“మరి అలా అయితే ఇంకొంచెం ఎక్కువ దూరం వెళ్లి ఎక్కువ చేపలు 

పట్టి తేవచ్చుగా ?” అడిగాడు మన్మధ రావు 

.

“ఇపుడు నేను సంపాదిస్తున్న సంపాదన నాకూ నా పిల్లలకూ కుటుంబానికీ సరిపోతుందండి”

.

“మరి మిగతా టైం అంతా ఏమి చేస్తావూ ?”

"ఏముందండీ ? రాత్రి లేటుగా పడుకుంటాను . ఉదయం లేచి చేపలు పట్టుకుంటాను . అవి అమ్మి వస్తాను . పిల్లల్హ్తో ఆడుకుంటాను మద్యాహ్నం నేనూ , మా ఆవిడా చిన్న కునుకు తీస్తాము . సాయంత్రం స్నానం చేసి ఫ్రెండ్స్ తో కలిసి గిటార్ వాయిస్తూ పాటలు పాడుకుంటాము . సరదాగా గడిపేస్తాము . ఇంకేమి చేస్తాం సర్ ?”

.

“నేను ఎం . బి .ఎ చేశాను . నీకు కొన్ని సలహాలు ఇస్తాను చూడు . నువ్వు ఇంకొంచెం ఎక్కువ సేపు చేపల వేట చెయ్యాలి . అలా ఎక్కువ చేపలు అమ్మడం ద్వారా ఎక్కువ సంపాదనతో అదనం గా పెద్ద బోటు కొనుక్కోవాలి”

.

“ఆయ్ ! తర్వాత ఏమి చెయ్యాలండి ?”

.

“అలా ఎక్కువ వచ్చిన డబ్బుతో ఇంకోటి ఇంకోటి బోట్లు కొనుక్కోవాలి మధ్యవర్తులకు కాకుండా నువ్వే డైరెక్ట్ గా అమ్మడం మొదలుపెట్టాలి అప్పుడు ఇంకా డబ్బు వస్తుంది . నువ్వే నీ స్వంత ప్రాసెస్సింగ్ ప్లాంట్ పెట్టావనుకో ! నీ సంపాదన పెరిగిపోతుంది . నువ్వు సిటీ కి మకాం మార్చేసుకోవచ్చు . అక్కడనుండే నీ వ్యాపారం అభివృద్ది చేసుకోవచ్చు .”

.

“ఇదంతా జరగడానికి ఎంతకాలం పడుతుందండి ?”

“ఎక్కువ కాలం పట్టదు. జస్ట్ ఒక 20-25 ఏళ్ళు పడుతుంది అంతే” అన్నాడు మన్మధరావు

.

“ఆ తర్వాత?”

.

“బిజినెస్ పెరిగాక స్టాక్ మార్కెట్ లో నీ షేర్లు అమ్మి డబ్బు చేసుకోవచ్చు .”

.

“అప్పుడు నేను ఏమి చెయ్యాలి ?”

.

"ఏముందీ ? రాత్రి లేటుగా పడుకుంటావు. పిల్లల్హ్తో ఆడుకుంటావు . మద్యాహ్నం నీవూ , మీ ఆవిడా చిన్న కునుకు తీస్తాఋ . సాయంత్రం స్నానం చేసి ఫ్రెండ్స్ తో కలిసి గిటార్ వాయిస్తూ పాటలు పాడుకుంటారు . సరదాగా గడిపేస్తావు . జీవితం ఎంజాయ్ చేస్తావు ” 

.

.

.

“అయ్యా ! ఇపుడు నేను అదే చేస్తున్నానుగా !”

.

Comments

Popular posts from this blog

గజేంద్ర మోక్షం పద్యాలు.

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!