జాషువ పద్యాలు !


జాషువ పద్యాలు!

.

నా కవితా వధూటి వదనంబు నెగాదిగ జూచి రూపురే
ఖా కమనీయ వైఖరులు గాంచి భళీభళి యన్నవాడె "మీ
దేకుల?"మన్న ప్రశ్న వెలయించి చివాలున లేచి పోవుచో
బాకున గ్రమ్మినట్లగును పార్ధివ చంద్ర! వచింప సిగ్గగున్.
కులమతాలు గీచుకొన్న గీతల చొచ్చి
పంజరాన కట్టుపడను నేను
నిఖిల లోక మెట్లు నిర్ణయించిన నాకు
తరుగు లేదు విశ్వనరుడ నేను.
కవి దిగ్గజంబన్నఘనమైన బిరుద మ
ర్పించె నాకుం జెళ్ళపిళ్ళ సుకవి
కవి చక్రవర్తి సత్కవి కోకిలం బన్న
బిరుదాళి శిరమున దురమి కొమ్ము
టేనుంగు మీద నూరేగించి కనకాభి
షేకంబు చేసి యాశీర్వదించి
సకలాంధ్ర సీమంబు సన్మానంబులు చేసె
వేలు వేల్ విశ్వ విద్యాలయాలు
సుకవిగా గ్రంధ కర్తగా సుప్రతిష్ఠ!
( జాషువ పద్యాలు)

Comments

Popular posts from this blog

గజేంద్ర మోక్షం పద్యాలు.

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!