నేర్చుకుందాం ..(7)...“న భూతో న భవిష్యతి” !

నేర్చుకుందాం ..(7)...“న భూతో న భవిష్యతి” !
.
ఏదైనా గొప్ప సంఘటన జరిగి నపుడు, పెద్ద కష్టం వచ్చినపుడు,
గొప్ప వ్యక్తులవిషయంలోను పై వాక్యం ‘ గతంలో కాని, భావిలో కాని లేదు’
లేక చూడ లేదు అన్న సందర్భంలో వాడుతాము
దీనిని కవి హాస్యంగా ఒక లోభి (పిసినారి) విషయంలో చెప్పిన ‘చాటువు యిది’
.
“ కృపణేన సమో దాతా ‘ నభూతో నభవిష్యతి’/
అస్ప్రుసన్నేవ విత్తాని యః పరేభ్యః ప్రయచ్ఛతి”//
.
“ కృపణుడు అనగా పిసినారి. పిసినారి కంటే మించిన దాత ఏ కాలంలోనూ ఇంకొకడు ఉండడు.
.
ఎలా అంటే -వాడు బ్రతికినన్నిరోజులు ఖర్చుపెట్టకుండా,
ధనాన్నితాక కుండా, దాచిఉంచిమరణించాక
ఇతరులకి ఒప్ప చేపుతాడు.”
అందుకనే పిసినారితో సమానమైన దాత “ భూతకాలంలో కాని, భవిష్యత్తు లో కాని” ఉండడు. అని వ్యగ్యంగా కవిచేప్పిన వాక్కు.
.
అందరూ అలా ఉండకుండా బ్రతికి ఉన్నపుడే దానం చేయాలి అని సుభాషితకారుడి సూచన.

x

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!