మౌలాలి కమాన్/ మౌలాలీ దర్గా!

మౌలాలి కమాన్/ మౌలాలీ దర్గా!

(Katta Srinivas గారికి కృతజ్ఞతలతో.)

.

మౌలాలీకి దగ్గరలోని కొండమీద నిర్మించిన ఈ దర్గా హైదరాబాద్ నగరానికి ఈశాన్య దిశన వుంటుంది. దర్గాలలో ఇది ప్రత్యేకమైనది ఎందుకంటే సూఫిసాధువుల సమాధులు వుండటం వల్ల తయారైన దర్గా కాదిది. మహిమ మహత్తుల ఆధారంగా ఇది నిర్మించ బడిందని చెపుతారు. మహమ్మద్ ప్రవక్త మేనల్లుడు హజ్రత్ ఆలీ జ్ఞాపకార్ధం నిర్మించారు.

.

ఒక కథ ప్రకారం ఇబ్రహిం కూలీ ఆస్థానంలో పనిచేసే యాకూబ్ అనునతడు కొండపై హజ్రత్ అలీ కూర్చున్నట్లు ఆశ్చర్య కరంగా వారి చేతి గుర్తులు బండరాతి పై ముద్రలుగా పడినట్లు కలగంటాడు. తర్వాత అంటువంటి ముద్రలను నిర్మించి ఆ కొండపై ప్రతిష్టింప చేస్తాడు. ఇబ్రహిం షా తర్వాత ఒక మసీదును కూడా దర్గా పక్కన కొండపై నిర్మిస్తాడు. ఒక అసుర్ ఖానా, బారాదరీ (పెవిలియన్) మరియు నౌఖర్ ఖాన్ ( డ్రమ్స్ ని మ్రోగించే ప్రదేశం) కూడా కుతబ్ షాహీ సమయంలోనే నిర్మించారు.

చారివూతక మౌలాలి కమాన్ క్రీ.శ. 1812లో నిర్మితమైంది. స్థానిక కొండమీద ఉన్న మౌలాలి దర్గాకు వెళ్ళేందుకు ప్రధాన ద్వారంగా దీనిని నిర్మించారు. సికింద్రాబాద్ కు 10 కిలోమీటర్ల దూరంలోని ఈ కమాన్ అసఫ్‌జాహీల కాలంలో నిర్మితమైంది. ఈ ప్రాంతంలోనే తొలిసారి ఆరవ నిజాం నవాబ్ మీర్ మహబూబ్ ఆలీఖాన్ జైలును కూడా నిర్మించినట్లు చెబుతారు. తరువాత ఆ జైలును చర్లపల్లికి మార్చారు.

2,107 అడుగుల ఎత్తులో వున్న ఈ దర్గాను చేరుకునేందుకు 500 మెట్లతో ఒక మెట్ల దారి కూడా వుంది.

.

హుడా హెరిటేజ్ కన్జర్వేషన్ కమిటీ చే గుర్తించబడిన 11 ప్రాంతాలలో ఇదొకటి.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!