రాకోయి.. అనుకొని అతిధి!

రాకోయి.. అనుకొని అతిధి!

.

రాకోయి.. అనుకొని అతిధి

కాకి.. చేత కబురైనా పంపక

రాకోయి.. అనుకొని అతిధి

వాకిటి తలుపులు తెరువనే లేదు..

ముంగిట ముగ్గులు తీర్చనేలేదు (2)

వేళ కాని వేళ ఈ వేళ కాని వేళా..

ఈ వేళ కాని వేళ ఇంటికి రాకోయి అనుకోని అథిధి

రాకోయీ…

సిగలో పువ్వులు ముడవాలంటే

విరిమల్లెలు వీకసింపనే లేదు

కన్నుల కాటుక దిద్దలంటే

నిద్దుర నీలాలు వీడనే లెదు

పాలు వెన్నలు తేనే లేదు..

పంచ భక్ష్యమ్ములు సేయనే లేదు..

వేళ కాని వేళా..

ఈ వేళ కాని వేళా విందుకు రాకోయి అనుకొని అతిధి

రాకోయి…

ఊరకే దారిని పోతూ పోతూ అలసి వచ్చితివో

ఒంటరిగా ఉన్ననని నేను తెలిసే వచ్చితివో

రమ్మనుటకు సాహసం చాలదు

పొమ్మనుట మరియాద కాదే.

వేళ కాని వేళా..

ఈ వేళ కాని వేళా విందుకు రాకోయి అనుకోని అతిధి

కాకి.. చేత కబురైనా పంపక

రాకోయి.. అనుకోని అతిధి

రాకోయీ…

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

గజేంద్ర మోక్షం పద్యాలు.