అన్నవిక్రయం మహాపాపం!

అన్నవిక్రయం మహాపాపం!

(#KanchiParamacharyaVaibhavam – #కంచిపరమాచార్యవైభవం)

-

స్వామి వారికి అనేక వృత్తులు చేసేవారు శిష్యులు గా ఉంటారు కదా! వారిలో హోటల్ వ్యాపారం చేసే ఒక మహాభక్తుడున్నాడు. చెన్నపురిలో అతనిది పెద్ద ప్రధానమైన కేంద్రంలో బాగా నడిచే హోటల్. ఆయనకు స్వామివారికి తన విభవము కొద్దీ ఎంతో చెయ్యాలని ఉండేది. ఆయన యడ స్వామివారికి కుడా అపారమైన కరుణ ఉండేది. అన్నదానము వంటి అనేక మహత్తరమైన కర్యకరమాలు అయనకు చెప్పి చేయిస్తూ ఉండేవారు. ఆయనున్నంత కాలం లాభాలలో కొంత భాగం అన్నదానానికి, అనాధల అవసరాలకి ఖర్చుపెట్టాలని ఆదేశించారు స్వామివారు. అతను ఆ విధంగానే నడుచుకున్నాడు.

అయితే మహాస్వామివారి జీవితంలొ ఒక్కసారి అయినా అతనివద్ద భిక్షావందనం స్వీకరించలేదు. ఆది శంకర భగవత్పాదుల పాదుకలకు శ్రీమఠంలో జరిగే పూజలలో శిఖ ఉన్నపటికీ వారిని నేరుగా కుర్చొవడానికి అనుమతి ఈయలేదు. పూజకి పళ్ళ వంటివి తప్ప శ్రీవారికుపయొగించే ఏ వస్తువూ అతని నుండి స్వీకరించడానికి అంగీకరించలేదు. అన్నవిక్రయం కూడనిదని వారి ఉద్దేశం. అన్నవిక్రయంలో లభించిన సొత్తు స్మృత్యుక్త నియమములను నిలబెట్టడానికి, ప్రచారం చెయ్యడానికి ఆదిశంకరులచే స్థాపించబడిన సంస్థకు తగదని వారి ఉద్దేశం. అన్న విక్రయం వలన వచ్చిన ద్రవ్యం అన్నదాననికే అకూడాదా నేరుగా అతని చేత చేయబడే అన్నదాననికే ఉపయొగించబడాలని వారి నిర్ణయం. వారి మనసు ఎంత ఆర్ద్రమో, ధర్మపరిపాలనమూ అంత నిర్దుష్టము.

పట్టణాల్లో పర్యటిస్తే గానీ పీఠానికి మంచి ఆదాయం ఉండదు. స్వామివారికి పట్టణాల్లో ఆచారనుస్టానము కొదవగా ఉంటాయని అభిప్రాయం. చిన్న చిన్న గ్రామాలల్లో పర్యటిస్తూ ఉండేవారు. స్వామివారొకతూరి కావేరి నదీ తీరంలో ఉన్న చిన్న చిన్న గ్రామల్లో మకాం చేసి ఉన్నారు. అదొక అగ్రహారం-కానీ అప్పటికి ధనికులెవరూ లేరు. గ్రామమంతా పూజ చుడటానికి వచ్చి సంతర్పణలో సుష్టుగా భొజనం చేసి పొతూఉండేవారు. భిక్ష చేసేవారే లేరు. మేనేజర్ చెప్పినా స్వామివారు వినిపించుకొవడం లేదు.

ఓ రోజు సంతర్పణకు సామనుకు వెళుతుంటే స్వామివారికి వినిపించేటట్లు “ఏమయ్యా! ఈ రకంగా సంతర్పణకే సమానంతా కొలుస్తూపొతే రేపు చంద్రమౌళీశ్వర పూజకు కొలవడానికి సంబారాలే మిగలవు” అన్నారట.

స్వామివారు మేనేజర్ ని పిలిచి చంద్రమౌళీశ్వరునికి సంబారాలు కొలవడానికి మనమెవరం. ఆయన తలుచుకుంటే ధనపురాశుల్నే కొలుచుకోవలసివస్తుంది… అని ముగించేంతలో ప్రక్క ఊరి మీరాసిదారు బరువైన నాలుగు మూటలు మోయించుకుని వచ్చి దర్శనానికి వచ్చారట.

నమస్కారం అయిన తరువాత, స్వామీ! చాలాకాలంగా మా గ్రామం రమ్మని అర్ధిస్తున్నాను. తమరు అనుగ్రహించలేదు. ఇప్పుడు నేను కాశీ పోవాలనుకుంటున్నాను. తిరిగి రావడానికి ఎన్ని రోజులు పడుతుందో? అప్పటికి నా పరిస్థితి ఎల ఉంటుందో? శ్రీవారు ఎకాడ ఉంటారో? నేను ఉడతాభక్తిగా సమర్పిద్దాం అనుకున్న ఈ నాణెములను స్వీకరించండి అన్నారట. మేనేజర్ నోట మాట రాలేదట. స్వామివారు మీరాసీదారుతో ఆయన కాశీలో చేయవలసిన విధులు ముచ్చటించి పంపించివేసి,

“అయ్యా! మేనేజర్ గారూ! చంద్రమౌళీశ్వరునికి కొలవడం సంగతి తరువాత ముందు ఈ నాణెములను కొలుచుకోండి” అన్నారట.

వారిని డబ్బు చూపి ఎవరూ ప్రలోభపెట్టలేరు. శ్రీవారొక సారి పల్లకీలో ఒక గ్రామం నుండి వేరొక గ్రామమునకు వెళుతున్నారు. దారిలో పెద్ద ఫ్యాక్టరీ ఉన్నది. ఆ పారిశ్రామికవేత్తకు స్వామివారు తన ప్రాంగణములో అడుగు పెడితే కనకవర్షం కురుస్తుందని నమ్మకం. స్వామివారిని ప్రార్థించాడు. ఆయన బదులు చెప్పలేదు.

చేతిలో వందరూపాయల కట్ట ఒకటి పట్టుకుని చూపుతూ ప్రార్థింపనారంభించాడు. ఆ రోజుల్లో పదివేలు చాలా పెద్దమొత్తం కదా! ప్రలోభపడకపొతారా అనుకున్నాడో ఎమో! డబ్బు చూపుతూ రావలి రావలి అని ప్రార్థిస్తున్నాడు.

శ్రీవారు “ఎమిరా! భడవా! డబ్బు చూపి నన్ను ప్రలోభపెడదామనుకుంటున్నావా. నేను రానే రాను ఫో!” అని ముఖం ప్రక్కకి త్రిప్పుకున్నారట.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!