సిగ్గులేదు నా డబ్బుతో నీ భార్యా బిడ్డలను పోషిస్తావా?

-

సిగ్గులేదు నా డబ్బుతో నీ భార్యా బిడ్డలను పోషిస్తావా?

-

ఒక యువకుడికి చదువు అయిపోయిన తర్వాత మంచి ఉద్యోగము వచ్చింది. వాళ్ళ ఆఫీస్ ముందు ఒక బిచ్చగాడు అడుక్కుంటున్నాడు. ఇతను రోజు ఒక రూపాయి బిచ్చం వేసేవాడు. రెండు సంవత్సరాలు అయిన తర్వాత అర్ధ రూపాయి వెయ్యడం ప్రారంభించాడు . మళ్ళీ రెండు సంవత్సరాలు అయిన తర్వాత పావలా ఇవ్వడం మొదలు పెట్టాడు.

ముష్ఠి వాడు: అయ్యా మీరు ఒకప్పుడు నాకు రూపాయి ఇచ్చేవారు, తర్వాత కొద్ది కాలానికి అర్ధరూపాయి ఇవ్వడము మొదలుపెట్టారు, ఇహ ఇప్పుడు మరీ ఘోరంగా పావలాయే ఇస్తున్నారు . ఇట్లా అయితే మేము ఎట్లా బ్రతుకుతామయ్యా?

-

ఉద్యోగి: నాకు ఉద్యోగం వచ్చిన క్రొత్తలో నేను ఒంటరిగా ఉన్నాను కాబట్టి నీకు రూపాయి ఇచ్చాను, తర్వాత నాకు పెళ్లి అయ్యింది. నా భార్య వలన కొంత కర్చు పెరిగింది, కాబట్టి అర్ధ రూపాయి ఇచ్చేవాడిని. ఇప్పుడు నాకు ఒక కొడుకు పుట్టాడు , మళ్ళీ కర్చు పెరిగింది కాబట్టి ఇప్పుడు పావలా ఇస్తున్నాను. అయినా నా భార్య బిడ్డలను నేను పోషించుకోవద్దా?

-

బిచ్చగాడు (కోపంతో ఊగిపోతూ): అంటే నాడబ్బుతో నీ భార్యా బిడ్డలను పోషించుకుంటున్నావా? నీకు సిగ్గులేదు ...!

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!