ఎచటికి మన ప్రయాణం !

ఎచటికి మన ప్రయాణం !

-నిర్వేదం 

.

పిచ్చి కుదిరితే గానీ పెళ్ళి కుదరదు,పెళ్ళి కుదిరితే గానీ పిచ్చి 

కుదరదు అన్నట్టు సొంతంగా పూనుకుని ఏదైనా చేస్తే అది కాస్తా ఎదురుతంతే అభాసుపాలవుతామని జనం గట్టిగా అడిగితే గానీ చెయ్యని జడత్వం ప్రభుత్వంలో ఉంది.

తమకేం కావాలో తెలియని అజ్ఞానం వల్ల అన్నిటికీ ప్రభుత్వం మీద ఆధారపడుతూ సొంతంగా ఆలోచించి సరైన పరిష్కారం కోసం డిమాండు చెయ్యని బద్ధకం ప్రజల్లో ఉంది.

టపటపా స్కూళ్ళూ కాలేజిలూ సాంక్షన్ చేయించేసుకుని బొట్లేరింగ్లీషు టకటకా చదివేసి ఉన్న పది ఉద్యోగాలకి వంద మంది పోటీ పడితే ఎంత గింజుకున్నా పదిమందికే ఉద్యోగాలు వస్తాయి.ఆ పదిమందీ కాలరెగరేస్తూ పోటుగాళ్ల మాదిరి పోజులు కొడుతున్నారు.

మిగిలిన 90 మందిలో మా కులానికి రిజర్వేషన్ శాతం పెంచితే గానీ తమకు మరిన్ని ఉద్యోగాలు రావని కొన్ని కులాల వాళ్ళూ వాళ్ళకి పెంచితే మా వాటా తగ్గుతుందని కొన్ని కులాల వాళ్ళూ కొట్టుకు చావడమే తప్ప కలిసి కూర్చుని తెలివిగా ఆలోచించి సమస్యకి మూలం చూసి సరైన పరిష్కారం కోసం ప్రయత్నించాలనే సద్బుద్ధి లేదు.

ఒకసారి రాగింగులో సీనియర్లు ఆరవ వేదం అంటే ఏమిటి అని అడిగారు - 

నేను నిర్వేదం అని చెప్పాను!

Comments

Popular posts from this blog

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.