గోంగూర పుట్టక !

గోంగూర పుట్టక !

.

ఖగపతి అమృతము తేగా

భుగభుగమని పొంగి చుక్క భూమిని రాలన్

జిగురించిన గోంగూరకు

నెగబడని జనుండు మూఢుఁ డెద్దై బుట్టున్ !

-

గోంగూర పచ్చడి!

-

మంచి రుచి.. మంచి జీర్ణకారి...

పైపెచ్చు సుఖ విరేచనకారీ యైన

గోంగూర పచ్చడిని ఆస్వాదిస్తూ

బువ్వ తినే వారి జన్మే ధన్యం...

-

గోంగూర పాట !

నేనెవ్వరి తో చెప్పకుండ గొంగురకి 

మా అత్త గారు చూడకుండ గొంగురకి 

రంగు పింగులు చేసుకుంటో గొంగురకి 

నా రంగనాధుడు వచ్చినాడే గొంగురకి .

-

గోంగూర సిని గీతం !

-

హేయ్ గోంగూర తోటకాడ కాపుకాసా

హేయ్ హేయ్ కోడికూసె వేళదాక ఎదురుచూసా ||

అంతలోనె కరిగిపోయె ముద్దు ఆశ

నీకు వెన్నముద్ద లిచ్చుకుంట వేంకటేశ

కోరుకున్న కోరకండ్ల నోరు ముద్దేపుడమ్మో

ఓరి పిల్లడా తలగడా మల్లెపూల జల్లెడా

నువ్వు నాకు నచ్చినావు అందగాడ

ఓసి అమ్మడు జిమ్మడు అంత నచ్చినప్పుడు

దాచమాకు ఉట్టిమీద పాలమీగడ

హేయ్ గోంగూర తోటకాడ కాపుకాసా

హేయ్ హేయ్ కోడికూసె వేళదాక ఎదురుచూసా ||

-

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!