గోదారి గట్టు రాజమండ్రిలో ఉంది. పాట మూగ మనసులు సినిమాలో ఉంది!

గోదారి గట్టు రాజమండ్రిలో ఉంది. పాట మూగ మనసులు సినిమాలో ఉంది!

-

ఆ లు,గుణింతాలు గుర్తున్నాయి కదా !

.అ=అక్కినేని, ఆ=ఆదుర్తి .!

సరే....అ ఆ లు,గుణింతాలు గుర్తున్నాయి కదా ..ఇవాళ మీకు వైవిధ్యంగా ఉండేలా నేర్పుతా...వింటారా?’

‘ఓ....వింటాం మాస్టారూ... చెప్పండి...’

‘అ అంటే అక్కినేని, ఆ అంటే ఆదుర్తి’

‘అవి ఇంటిపేర్లు కదండీ’

‘అవునర్రా...అక్కినేని నటన, ఆదుర్తి దర్శకత్వం వెరసి తెలుగు సినీ కళామతల్లి జన్మ ధన్యమైంది. కాబట్టి ఈ అఆల గురించి అనుకోవడంలో తప్పేమీ లేదు’

‘హి హి హి’

‘సైలెన్స్ ... మూగ మనసులు సినిమా ఆయనే డైరెక్ట్ చేశారు’

‘అందులో గోదారి గట్టుంది కదండీ..’

‘గోదారి గట్టు రాజమండ్రిలో ఉంది. పాట మూగ మనసులు సినిమాలో ఉంది.’

‘అయితే సార్ ..అక్కినేని, ఆదుర్తి ఇద్దరు మిత్రులు అన్నమాట’

‘కాబట్టే ఇద్దరు మిత్రులు సినిమా అంత బాగా వచ్చింది. 

అందులో ఫారిన్ ట్యూన్ కి తెలుగు కోటింగ్ ఇచ్చి సంగీత దర్శకులు రాజేశ్వర రావు గారు భలే పాట చేశారు..

హలో హలో ఓ అమ్మాయీ’

‘పిలిచారా సార్...’

‘నిన్నా తల్లీ? లేదులే ..పాట గొణిగా...అంతేలే ..’

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!