శ్రీ విశ్వనాథ సత్యనారయణగారి "మూగనోము" ! -

శ్రీ విశ్వనాథ సత్యనారయణగారి "మూగనోము" !

-

బియ్యపు గింజలన్ జిగురు పేడిన గందవు వచ్చి బొట్తుతో

తియ్యని చిన్ని నీ నొసలి తీరులు కుంకుమ తీర్చి ముంగిలన్

తొయ్యలి! నోము చాఱికలతో పనపాడిన ముద్దరాలు నీ

పయ్యెద వ్రాల నీవు నతి పట్టిన దీవన లీయఁ జూచెడున్!

-


నీ తెలిపట్టు చీర మెయి నీడలు పారి ముసుంగు నంజ క్రొం

బూతల తెల్ల లే మొగిలుపోలిక వాలిక గాలిఁ దూలిపో

నేత బెడంగు కుచ్చెలలు నీ చిఱుకాళుల ముద్దు తోఁచెనో,

లేఁతపొరాడు పయ్యెద చలించిన పచ్చని తాళి తోఁచెనో!

Comments

Popular posts from this blog

గజేంద్ర మోక్షం పద్యాలు.

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!