యోగము - చిత్తము !


-

యోగము - చిత్తము !

-

అధిక సంఖ్యకులకు యోగమంటే హఠయోగము, యోగాసనములు.లేదా ప్రాణాయామము.ఇంతకు మించి అసలైన దానిని గురించి ఎవరూ మాట్లాడలేదనిపిస్తుంది. పతంజలి యోగ సూత్రాలలో యోగము నిర్వచనం ఉంది

. 'యోగః చిత్తవృత్తి నిరోధకః' చిత్తవృత్తి నిరోధమే" యోగము.

- ఏమిటీ చిత్తము?ఎక్కడ ఉంది? రుక్మిణిదేవి కృష్ణునికి పంపిన తన సందేశములో..

.

నట్టి నీయందు నా చిత్త మనవరతము

నచ్చియున్నది నీ యాన నానలేదు

కరుణఁ జూడుము కంసారి ! ఖలవిదారి !

శ్రీయుతాకార ! మానినీ చిత్తచోర !

.

అందరి చిత్తాలను హరించిన ఆ హరియందే ఆమె చిత్తవృత్తికూడాకేంద్రీకృతమైనది. 

ఈ చిత్తముయొక్క ప్రాముఖ్యత సనాతన ధర్మములోనే కనబడుతుంది.

5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు బాహ్యంగా 

కనబ్డే ఉపకరణాలు. అలాగే నాలుగు అంతః కరణాలున్నాయి మనిషికి --- మనస్సు, బుద్ధి,చిత్తము, అహంకారము. 

వీటికి అధిష్ఠాన దేవతలున్నారు.

చంద్రుడు- మనస్సుకు, చతుర్ముఖ బ్రహ్మ -బుద్ధికి,

అచ్యుతుడు- చిత్తానికి, శంకరుడు- అహంకారానికీ. 

-

పాశ్ఛాత్యనాగరికత,విజ్ఞాన శాస్త్రం క్రైస్తవాది మతాలు

ఈచిత్తానికి ఈ మధ్యవరకు ప్రాధాన్యత ఈయలేదు.

Mind అనె పదం మొత్తానికి వర్తిస్తుంది. 

భారతీయ తత్త్వ శాస్త్రం దానిలో ఒక అంతర్గత వ్యవస్థను గుర్తిస్తుంది. ఇంగ్లీషు అనువాదాలుగా mind,intellect, consciousness, ego లను ఉపయోగిస్తారు

.ఆంగ్లంలో ఈ పదాలు అనేక అర్థాలలో ఉపయోగిస్తారు. అది మరో ప్రపంచం. వీటితో జీవుడు, ఆత్మ, బ్రహ్మము, యోగమునకు వీటితో సంబంధం తెలుసుకోవాలి.

Comments

Popular posts from this blog

గజేంద్ర మోక్షం పద్యాలు.

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!