మైదానం నుండి ఆశ్రమం వరకు ప్రయాణం .. చలం.

మైదానం నుండి ఆశ్రమం వరకు ప్రయాణం .. చలం.

-

చలం గారు ఓ ప్రత్యేకమైన వ్యక్తి....

బెజవాడ నుంచి రమణాశ్రయం

వరకు చలం గారి ప్రయాణం ఓ

దాచుకోవలసిన గొప్ప అనుభవం.

చలం గారి వ్యవహార శైలి కాస్త

అటు ఇటుగా వున్నా ఆయన

జీవితంలో తాను నమ్మిందే చేశాడు.

చలంగారి జీవితానికి చలమే హీరో!!

స్త్రీ సాంగత్యం నుంచీ ఈశ్వరోపాసన

దాకా ఆయన ప్రస్తానం ఓ జీవన కావ్యం!

చలంగారి జీవితమూ ,సాహిత్యమూ

వేరు వేరు కాదు.జీవితంలో జరిగిన 

సంఘటనలూ,తారసపడిన వ్యక్తులు

పాత్రలై మనల్ని పలకరిస్తారు. స్త్రీ స్వేఛ్చ

గురించి కలవరించీ,పలవరించిన చలం

ఆమెకు ఆర్ధిక స్వాతంత్ర్యం కావాలన్న

చిన్న లాజిక్ ను మిస్సయ్యారు.స్త్రీ శృంగార

రసాధి దేవత కావాలన్నాడే కానీ స్వతంత్రంగా

తన కాళ్లమీద తాను నిలబడటానికి ఊతమియ్యలేక

పోయాడు.పిల్లల పెంపకం గురించి ఏకంగా పుస్తకం

రాసిన చలం తన పిల్లల పెంపకం పట్ల నిర్లక్ష్యం వహించాడు.

చలం సిధ్దాంతాలు వాటికవై వైరుధ్యంగా కనబడతాయి.

ఏదేమైనా తెలుగు సాహిత్యంలో ఆయన రచనలు

చిరస్ధాయిగా నిలబడతాయి.చక్కని తెలుగు వాక్యానికి

చలం గారే కేరాఫ్!!! సో..చలం ది గ్రేట్!!

-

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!