హాస్య అవధానం !

శుభోదయం!

.

ఒక హాస్య అవధానంలో ఒక పృచ్చకుడు పంది, కోడిపెట్ట, చేప, కప్ప 

ఈ నాలుగు పదాలు బ్రాహ్మణుని ఇంట పెళ్ళిలో ఉపయోగించి ఒక పద్యాన్ని 

చెప్పండి అని అవధానికి సమస్యనివ్వడం జరిగింది. దానికి అవధాని 

ఇలా సమాధానం ఇచ్చాడు.

-

"ఊరంత 'పంది' రేసి నోరూరునట్లుగా 

వేడి వేడి ప'కోడిపెట్ట' ఇంపుసొంపగు రుచుల

పాయసము మోజెల్ల 'చేప ' చెప్పలేని 

రుచులు మా'కప్ప' గించే. !

-

అంటూ సమస్యను హాస్యభరితంగా పూరించాడు ఆ అవధాని.

( శ్రీ లక్ష్మీ నరసింహం జయంతి గారి హాస్యావధానం కార్యక్రమం నుండి . )

ఇక్కడ మూడవ పంక్తిలో మోజెల్ల చేప అంటే కావలసినంత తాగించి అని అర్ధం

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!