ఏడూ కొండలవాడా వెంకటేశా తిరుమలేశా... శ్రీనివాసా!

ఏడూ కొండలవాడా వెంకటేశా

తిరుమలేశా... శ్రీనివాసా!

ఇంకా కొనసాగుతున్న తమిళ భాష పెత్తనం!

భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో ఆంద్ర రాష్ట్రంలో భాగమైన తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వపు తమిళ ఆధిపత్యంలోనే ఇంకా ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఇందుకు ఉదాహరణగా కొన్ని రకాలైన సేవల పేర్లను పరిశీలించండి :

పరకామణి

కొయిల్ ఆళ్వార్ తిరుమంజనం

తిరుచ్చి

తిరుమాడవీధి

తిరుప్పావై

ఊంజల్ సేవై

తిరుమంజనం

తోమాల సేవ

మేల్చాట్ వస్త్రం

పోటు

పడి

వగపడి

చెప్పుకుంటూ పోతే ఎన్నో అర్ధం కాని అరవ పేర్లు. 

తమిళ భాషకు వ్యతిరేకంగా చెప్తున్న విషయం కాదు, తెలుగు భాషపై వున్న అభిమానం మాత్రమే. 

ఇలాంటి వాటిని పట్టించుకొనే నాధుడు లేడు. 

పరకామణి అంటే కానుకలు లెక్కించే ప్రదేశం, ఊంజల్ సేవ అంటే ఉయ్యాల సేవ అని, పోటు అంటే వంట గది అని, మేల్చాట్ వస్త్రం అంటే శేష వస్త్రం అని తెలుగులో (ఇంకా సరైన, ఖచ్చితమైన పేర్లు ఉండచ్చు) ఉపయోగించలేమా?

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!