ఆటుపోట్లు...జయ లలిత సినీ జీవితం .

ఆటుపోట్లు...జయ లలిత సినీ జీవితం .

(తెలుగు వారికి తెలిసిన జయలలిత.)

.

జయలలిత నాటి మైసూర్ రాష్ట్రంలోని మాండ్యా జిల్లా పండవపురా తాలూకాలోని మెల్కోటేలో 1948, ఫిబ్రవరి 24న జన్మించారు.

ఆమె తల్లిదండ్రులు జయరాం, వేదవల్లి(సంధ్య)లు. 

ఆ కాలంలో సంధ్య ప్రముఖ సినీ నటిగా వెలుగొందారు. జయరాం తాత మైసూరు సామ్రాజ్యంలో వైద్యునిగా పనిచేసేవారు. జయలలిత రెండేళ్ల వయస్సులోనే తండ్రి జయరాం మరణించారు. 

దీంతో సంధ్య బెంగళూరులోని తన తల్లిదండ్రుల ఇంటికి చేరుకుంది. ఆ తర్వాత చెన్నై కేంద్రం సాగుతున్న తమిళ చిత్రాలలో నటించడం ప్రారంభించింది. 

అప్పుడే వేదవల్లి తన పేరును సంధ్యగా మార్చుకుంది. జయలలిత చెన్నైలోని సేక్క్రేడ్ హార్ట్ మెట్రిక్యూలేషన్ స్కూల్‍‌లో ప్రాథమిక విద్యను అభ్యసించింది. జయలలిత చదువులో రాణించడంతోపాటు తన తల్లి నటిస్తున్న చిత్రాలలో కూడా నటిస్తుండేది. చదువుకు ఆటంకం కలగకుండా ఆమె తల్లి చూసుకునేది. 

ఈ క్రమంలో ఆమె నటించిన ఈపిస్ట్లి అనే ఇంగ్లీష్ చిత్రం 1961లో విడుదలైంది.

హీరోయిన్‌గా ఆమె మొదటిసారిగా నటించిన కన్నడ చిత్రం చిన్నదా గంబి. ఈ చిత్రం 1964లో విడుదలైంది. ఆ తర్వాత ఏడాది తమిళంలో విడుదలైన వెన్నెరా అదాయి చిత్రంలో నటించారు. 

అదే ఏడాది తెలుగులో వచ్చిన ‘మనుషులు మమతలు' చిత్రంలో నటించారు. అలా జయలలిత తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో దాదాపు 140 చిత్రాల్లో నటించారు. జాతీయ అవార్డుతోపాటు పలు ఫిల్మ్‌ఫేర్ అవార్డులను కూడా ఆమె సొంతం చేసుకున్నారు. 

సినీ జీవితం సమాప్తం.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!