గోబ్రాహ్మణేభ్య శుభమస్తు '!

గోబ్రాహ్మణేభ్య శుభమస్తు '!

గోవు అన్నది నశించిపోయింది. ఆబోతున్నది అదృశ్యమైపోయినది. ' గోబ్రాహ్మణేభ్య శుభమస్తు ' అన్న దేశములో , 'తేభ్యో శుభమ ' స్తన్న దుర్వాక్కే సర్వత్రా విజృంభించెను..

-

బ్రాహ్మణునకు గోవునకు దేశము బ్రతకరానిదయ్యెను.

ఇంకను బ్రాహ్మణుడే నయము. 

ఇంటిలో నుండి త్రోసివేయగా వాసములయినను పట్టుకుని వ్రేళ్ళాడుతూ ఉన్నాడు. ' 

నాది కర్మభూమి. ఈ భూమిలో నుండి కర్మ పోదన్న ' పంటి బిగువ వానికి వదలలేదు.

.

గోవు నోరులేని జంతువు. అది సభలు చేయలేదు. ' నా జాతి చచ్చిపోవుచున్నదో ' అని మొర పెట్టలేదు.

పాపము నిమ్న జాతుల లోనను చేర్చుకొనలేదు.

దానికి ఓటు లేదు. శాసనసభలకు తన ప్రతినిధులను ఏమి పంపించుకొనగలదు ! వలసపోయిన వారు, తాము పోయినచోటి జాతులను కూకటి వేళ్లతో కుద్దాలించినట్లు తనను కూడా ఎవరో కుద్దాలించిరి. తనకు పొలమునకు వలసవచ్చినది ఎవరు? ఎవరో కనిపించలేదు

-

(విశ్వనాథ సత్యనారాయణ -వేయిపడగలు!.)

Comments

Popular posts from this blog

గజేంద్ర మోక్షం పద్యాలు.

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!