నువ్వేం దేవుడి వ‌య్యా..జోకు


నువ్వేం దేవుడి వ‌య్యా..జోకు !

😜😜😜😜😜😜*

రామారావు రోజూ తన భార్య‌ టార్చర్ తట్టుకోలేక ఒకరోజు విసుగుచెంది ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకొని రోడ్డు వెంబడి పరధ్యానంగా న‌డుచుకుంటూ వెళుతున్నాడు.. వచ్చేపోయే వాహనాలను ఏమాత్రం పట్టించుకోకుండా అడ్డ దిడ్డంగా నడుస్తున్నాడు.. ఇంతలో ఒక కారు అతన్ని ఢీకొట్ట‌బోతే ఎవ‌రో వ‌చ్చి ప‌క్క‌కు లాగారు.. మ‌రి కొద్ది దూరం వెళ్ళాక ఒక మ్యాన్ హోల్‌లో ప‌డ‌బోతుండగా మ‌ళ్ళీ ఎవ‌రో ప‌క్క‌కు లాగారు.. ఇంకాస్త దూరం వెళ్ళాక లారీ వ‌చ్చి గుద్ద బోతే మ‌ళ్ళీ ఎవ‌రో లాగారు.. అనుమానం వచ్చిన రామారావు *ఎవరబ్బా నన్ను ఇన్ని సార్లు న‌న్ను ర‌క్షిస్తున్నారు* అని మనసులో అనుకొని వెనక్కి తిరిగి చూసి అక్కడున్న వ్యక్తితో *ఇంత‌కీ ఎవరయ్యా నువ్వు, నన్ను ఎందుకు వెనక్కి లాగుతున్నావ్* అని చిరాగ్గా అడిగాడు.. అప్పుడు ఆ వ్యక్తి రూపంలో ఉన్న దేవుడు నిజరూపం దాల్చి *బాబు నేను దేవుడుని, నువ్వు చాలా మంచివాడివి, అందుకే నిన్ను ర‌క్షించాను* అని అన్నాడు.. 

అప్పుడు సదరు ఆ వ్య‌క్తికి విప‌రీత‌మైన కోపం వ‌చ్చి 

*నువ్వేం దేవుడి వ‌య్యా ఇన్ని సార్లు పక్క‌కు లాగిన వాడివి నా పెళ్ళానికి తాళి క‌ట్టేప్పుడు ఎందుకు లాగ‌లేదు* అని నిల‌దీశాడ‌ట‌...😂😂😂😂😂😂

Comments

Popular posts from this blog

గజేంద్ర మోక్షం పద్యాలు.

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!