రాముణ్ణి గుర్తు చేసే సీత ఆకృతి!

రాముణ్ణి గుర్తు చేసే సీత ఆకృతి!

(శ్రీ విశ్వనాథ సత్యనారాయణ వారి రామాయణ కల్పవృక్షం' )

-

అశోకవనంలో హనుమకి కనబడిన సీత ఆకృతి రాముణ్ణి స్ఫురింప జేసిందని శ్రీ విశ్వనాథ సత్యనారాయణ వారి అద్భుత కల్పన.

-

ఆకృతి రామచంద్ర విరహాకృతి, కన్బొమ తీరు స్వామి చా-

పాకృతి, కన్నులన్ ప్రభు కృపాకృతి, కైశికమందు రామ దే-

హాకృతి, సర్వ దేహమునయందున రాఘవ వంశ మౌళి ధ-ర్మాకృతి, కూరుచున్న విధమంతయు స్వామి ప్రతిజ్ణ యట్లుగాన్!

-

ఆదర్శ దాంపత్యమంటే, ఆయన్ని చూస్తే ఆవిడ గుర్తుకు రావాలి, 

ఆమెను చూస్తే అయన గుర్తుకు రావాలి, వారి ఇంటి మర్యాద గుర్తుకి రావాలి.

-ఆచార్య శ్రీ జి.వి. సుబ్రహ్మణ్యం ఇలా చెప్పారు 

- "ఆధునికాంధ్ర జగత్తులో విశ్వనాధ ఒక విరాణ్మూర్తి. వచన కవిత్వం వినా ఆయన చేపట్టని సాహితీ ప్రక్రియ లేదు. పట్టింది బంగారం. చేయని పట్టూ లేదు. గేయం వ్రాసినా, పద్యం రచించినా, ముక్తం వ్రాసినా, మహా కావ్యాన్ని రచించినా విశ్వనాధ కృతిలో ఆయనదైన ఒక వ్యక్తిత్వం ప్రతిబింబిస్తుంది. వాక్కులో, వాక్యంలో, శబ్దంలో, సమాసంలో, భావంలో, భావనంలో, దర్శనంలో, విమర్శనంలో, భాషణంలో, భూషణంలో ఒక వైలక్ష్యం వెల్లివిరుస్తుంది. 

మహాకవిగా మనుగడ సాగించడానికి ఉండవలసిన మొదటి లక్షణం ఈ వ్యక్తిత్వం."వీరు అష్టావధానాలు చేసినట్లు మాత్రం నాకు తెలియదు.ఆయనకు తెలియని విద్య లేదు.సంగీతం,జ్యోతిష్యం లాంటి అనేక విద్యలలో కూడా ప్రావీణ్యం సంపాదించారు. వారు యవ్వనంలోఉండగానే భార్య చనిపోయింది. జీవితమంతా ఒంటరి తనంతో గడిపారు

.ఆంధ్రులు గర్వించతగ్గ ప్రఖ్యాత నటుడు, తరువాతి కాలంలో ముఖ్యమంత్రి అయిన శ్రీ నందమూరి తారక రామారావు గారు వీరి శిష్యుడే!

వారు వ్రాసిన "నాయకురాలు" అనే నాటకంలోని స్త్రీ పాత్ర అయిన నాగమ్మ పాత్ర ద్వారానే వీరి రంగస్థల జీవితం ప్రారంభం అయింది.

ఆయన చాలా నిరాడంబరంగా జీవించేవారు.

వారివి కొన్ని అరుదైన ఛాయా చిత్రాలను శ్రీ తిరుమల రామచంద్ర గారు వ్రాసిన గ్రంధం "మరపురాని మనీషులు" నుండి సేకరించి,వాటిని ఈ దిగువన పొందుపరుస్తున్నాను.( శ్రీ తిరుమలరామచంద్ర గారికి స్మృత్యంజలితో....)

Comments

Popular posts from this blog

గజేంద్ర మోక్షం పద్యాలు.

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!