మహా భారతం..ఆదిపర్వం .నుండి ఒక కధ !

మహా భారతం..ఆదిపర్వం .నుండి ఒక కధ.!

.

ఒకానొకప్పుడు ఇంద్రునితో సమానమైన బలపరాక్రమము కలిగిన రాజు వసువు అనే పేరుకల రాజు చేది రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. 

-

సాధారణగా రాజుగారి కోటకి చాల దగ్గరలో ఏదో ఒక నది ప్రవహిస్తూ ఉంటుంది. కందకాలలో నీటిని నింపటానికి, తోటలో చెట్ల కి నీరు పెట్టటానికి నది ఒడ్డునే కోట కడతారు, కాబట్టి అక్కడ ఆ శుక్తిమతి అనే నది ప్రవహిస్తూ ఉంది.

.

నదిని స్త్రీ వాచకం తో పిలుస్తారు, సముద్రాన్ని పుం వాచకం తో పిలుస్తారు. ఈ నది అలా ప్రవహిస్తూ వెళ్తుంటే, ఆ నది యొక్క అందచందాలని చూసింది ఒక పర్వతం, ఆ పర్వతం పేరు కోలాహలము. ఆ పర్వతానికి నది నచ్చింది. ఈవిడ మీద మనసు పెంచుకున్నాడు. అలా ఉంటుందా లోకం లో అని మీరు అనుకోకూడదు, జీవుడు అని ఒకడు ఉంటాడు. అసలు యదర్దమునకు జీవుడు సుఖ దుఃఖాలని అనుభవించటానికే శరీరం వస్తుంది.

.

ఈ శరేరాన్ని ఈశ్వరుడు ఎలా ఇస్తాడు అంటే , పాపం తియ్యాలి , పుణ్యం తీసేయ్యాలి. ఈ రెండు ఎలా తీస్తాడు? శరీరాన్ని ఇస్తారు , ఇచ్చి జీవుణ్ణి ఇందులో పెడతాడు. జీవుడు కనపడదు, శరీరం కనిపిస్తుంది. వీళ్ళు జీవుడు స్థాయి లో మాట్లాడుతున్నారు అని మీరు అర్థం చేస్కోవాలి. అందుకని ఈ కోలాహలం అన్న పర్వతానికి , శుక్తి మతి అన్న నది నచ్చింది.

.

ఆ కోలాహలం అనే పర్వతం అమాంతం లేచి వచ్చి , ఈ శుక్తిమతి అనే నదికి అడ్డంగా కూర్చుంది. అనగా స్త్రీ పురుష సంభందం గా అనుభవించింది అని ఒక మాట అంటే దోషం ఏమి లేదు. కానీ బలత్కారము ఆ నదిని అనుభవించింది ఆ కోలాహలం అనే పర్వతం. ఆ శుక్తిమతి పొందిన పరితపాన్ని రాజు అర్థం చేస్కున్నాడు. రాజు అంటే ఎవరు , క్షితి నాధుడు. లోకంలో ఏ జీవికి బాధ కలిగినా ఆయన తీర్చాలి. అందుకని ఆయన వెళ్లి ఆయన కాలు తో తన్నాడు కోలాహలo అన్న పర్వతాన్ని, అది ఎగిరి ఎక్కడో పడింది.

.

ఆ వసువు కి ఉన్న బలం అలాంటిది. ఆయన ఇంద్రుడు ఇచ్చిన విమానం లో పైన తిరుగుతూ ఉంటాడు కాబట్టి ఆయన్ని ఉపరిచర వసువు అని పిలిచారు. ఆ ఉపరిచర వసువు కాలితో తంతే ఆ కోలాహలం అన్న పర్వతం ఎక్కడో పడింది. అంటే మీరు ఒకటి గమనించాలి. ఏదో కధ కింద చదవటం కాదు. రాజు అనగా ఎంత ధర్మాన్ని పాటించి ప్రాణుల యొక్క బాధ ని చూస్తూ ఉంటాడో, సమస్త ప్రాణుల యొక్క క్షేమాన్ని రాజు ఎలా చూడాలో చెప్తోంది.

.

ఆ పర్వతo ఆ నదితో సంఘమించడం చేత ఆ నదికి ఒక కొడుకు పుట్టాడు, ఒక కూతురు పుట్టింది. వాళ్ళు మనుష్య శరీరం తో పుట్టారు , ఇది ఈశ్వరాజ్ఞ. ఇప్పుడు ఆ పుట్టిన కొడుకు పేరు సుపదుడు. ఆ పుట్టిన ఆడపిల్ల పేరు గిరిజ . ఆ నది అన్నది మహానుభావుడు ఆ ఉపరిచర వసువు వచ్చి ఆ కోలాహలం అన్న పర్వతాన్ని కాల్తో తన్నాడు కాబట్టి ఆ పర్వతం ఎక్కడో పడింది. నాకు ఆ కోలాహలం అన్న పర్వతం వల్ల ఒక కొడుకు ఒక కూతురు పుట్టారు. వీళ్ళని రాజుకి ఇచ్చేస్తాను అని రాజుకి ఇచ్చేసింది.

.

రాజు ఈ గిరిక యొక్క అండ చందాలు చూసి ఆమెని పెళ్లి చేస్కున్నాడు. ఈ పిల్లవాడు ఉన్నదే సుపదుడు వీడిని తన సేనాపతిగా నియామకం చేసాడు. మీరు ఇక్కడ కొంచం విశాల హృదయం తో వినవలసి ఉంటుంది. వ్యాసుడు , నన్నయ గారు ఇంత తక్కువగా రాయవలసిన అగత్యం లేని వాళ్ళు అన్న పవిత్ర హృదయం తో వినవలసి ఉంటుంది.

Comments

Popular posts from this blog

గజేంద్ర మోక్షం పద్యాలు.

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!