శ్రీశ్రీ - జూన్ 9, 1973న విశ్వనాథకి సమర్పించిన అక్షర నీరాజనం !






-

_శ్రీశ్రీ - జూన్ 9, 1973న విశ్వనాథకి సమర్పించిన అక్షర నీరాజనం !

-

"మాటలాడే వెన్నెముక

పాటపాడే సుషుమ్న

నిన్నటి నన్నయ్యభట్టు

ఈనాటి కవి సమ్రాట్టు

.

గోదావరి పలుకరింత

కృష్ణానది పులకరింత

.

కొండవీటి పొగమబ్బు

తెలుగువాళ్ళ గోల్డునిబ్బు

.

అకారాది క్షకారాంతం

ఆ సేతు మిహీకావంతం

.

అతగాడు తెలుగువాడి ఆస్తి

అనవరతం తెలుగునాటి ప్రకాస్తి

.

ఛందస్సు లేని ఈ ద్విపద

సత్యానికి నా ఉపద!

-

(శ్రీశ్రీ వ్యాసాలు నుంచి)

.

శ్రీశ్రీకి విశ్వనాధ గారు అంటే చుక్కెదురు

."నా వంటి కవి మరో వెయ్యేళ్ళ వరకూ పుట్టడు" అని విశ్వనాధవారు అంటే,

శ్రీ శ్రీ గారు"నిజమే! వారు పుట్టి వెయ్యేళ్ళు అయింది" అనే వారు.

-

అయినప్పటికీ శ్రీశ్రీ గారి మహా ప్రస్తానంలోని 

"కవితా! ఓ కవితా" అనే గేయాన్ని శ్రీశ్రీ ముఖతః విన్న తరువాత ఆనంద బాష్పాలతో మనసారా శ్రీశ్రీ ని కౌగలించుకొని అభినందించారు.

-

అలాగే శ్రీశ్రీకి కూడా వీరంటే గౌరవం.శ్రీశ్రీ ఇలా విశ్వనాథను పొగిడారు ఒక సందర్భంలో,"నేను చిన్నతనంలో కలం పట్టిన కొత్తరోజుల్లో నన్ను బాగా ఆకర్షించిన ఇద్దరు కవులలో విశ్వనాథవారొకరు. నేనంటే సత్యనారాయణగారికి వాత్సల్యం. వారంటే నాకు గౌరవ భావం. 

ఎన్నో విషయాలలో వారికీ నాకూ చుక్కెదురు. అయినా భారతీయ భాషలన్నిటిలోనూ ఒక్క తెలుగులోనే గొప్ప కవిత్వం ఉందనడంలో ఇద్దరమూ ఏకీభవిస్తాం."

.

Comments

Popular posts from this blog

గజేంద్ర మోక్షం పద్యాలు.

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!