కన్నె కలలు!

-

-కన్నె కలలు!

.

"అందమైనట్టి మఱియును నాద రించు

నతడు చక్కని యు ద్యోగి యైన వాడు

తనకు భర్తగా నుంటను మనసు నందు

కన్నె పిల్లలు కందురు కలలు భువిని!

-

కన్న వారి యందు ఎంత ప్రేమ వున్నా యుక్త వయసు రాగానే సరి జోడి కోసం కలలు కంటుంది . 

తన కలల ప్రతిరూపాన్ని చూసిన సమయం నుండి క్షణమొక యుగమై సంగమ వేళకై నిరీక్షిస్తుంది . 

తోబుట్టువుల కన్నా తనతో ఏడు అడుగులు నడిచే వానికే ప్రాధాన్యత ఇస్తుంది . 

ఇరువురి పుట్టు పూర్వోత్తరాలు వేరైనా ,సంబంధం ఖాయమైన నుండి రెండు కుటుంబాల గౌరవం గురించి ఆలోచిస్తుంది . 

సంతోషమైనా ,భాదైనా తనతోనే పంచుకోవాలని తపించిపోతుంది . అతని ఆనందానికి రెట్టింపు ఆనందిస్తుంది .తనకి ఏమైనా అయితే విలవిల్లాడిపోతుంది . 

తన రోజు వారి ప్రార్ధనలు అతని యోగక్షేమముల తోనే మొదలుపెడుతుంది . 

అతనిలోనే అమ్మ,నాన్నల మరియు ఆత్మీయుల ప్రేమని చూసుకుంటుంది . 

ఆఖరకు బ్రహ్మ మూడి తర్వాత తన అస్తిత్వాన్ని మార్చుకొని పూర్తిగా తనకు వశమైపోతుంది .... 

అంతటి చిత్రమైనది ఈ కన్నెమనసు .........................

-ఎన్ని కలలు కంటున్నాం

ఎన్ని కొత్త ఆలోచనలు చేస్తున్నాం!

Comments

Popular posts from this blog

గజేంద్ర మోక్షం పద్యాలు.

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !