శ్రీ గరికపాటి వారి చమత్కారాలు .!

శ్రీ గరికపాటి వారి చమత్కారాలు

.

󾁒ప్రశ్న: ఉదయం లేవగానే 

మహిళలు..మంగళసూత్రాలు 

కళ్ళకద్దుకుంటారు.దేనికి?

☘జవాబు : వాటిమీదున్న గౌరవంతో మాత్రం కాదు!

భర్త మంగళసూత్రాలు ఉంచాడా,

అర్ధరాత్రివేళ ఏ అవసరానికో లాగేశాడా 

అన్న అనుమానంతో చూసి,

ఆ పూటకు దక్కాయన్న సంతోషంతో కళ్ళకద్దుకుంటారు!

.

󾁑ప్రశ్న: పెళ్ళిలో పెళ్ళికూతురు గౌరీపూజ చేస్తుంది కదా..మరి పెళ్ళికొడుకు?

☘జవాబు: 'డౌరీ' పూజ!

.

󾁒ప్రశ్న: ఆడవాళ్ళు అవధానం చెబితే....

󾀼జవాబు : ఏముంది....'గ్రామర్' తగ్గి 'గ్లామర్' పెరుగుతుంది!

.

󾁑ప్రశ్న : మన టీవీ యాంకర్లకి ఒత్తులు పలకడం సరిగా రావడం లేదు.

ఏం చేయాలి?


☘జవాబు: లక్ష 'ఒత్తుల' నోము చేయిస్తే సరి!

.

--శ్రీ గరికపాటివారి చమత్కారాలు

󾁆󾁆󾁆󾁆

Comments

Popular posts from this blog

గజేంద్ర మోక్షం పద్యాలు.

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!