కన్యాశుల్కము ..రామప్పంతులు యింటి సావిడి! (గురుజాడ అప్పారావు.)

కన్యాశుల్కము ..రామప్పంతులు యింటి సావిడి!

(గురుజాడ అప్పారావు.)

[రామప్పంతులు కుర్చీ మీద కూర్చుని వుండగా మధురవాణి నిలబడి

తమలపాకులు చుట్టి యిచ్చుచుండును]

రామ: నేనే చిన్నతనంలో యింగిలీషు చదివి వుంటే జడ్జీల యదట ఫెళఫెళలాడించుదును. నాకు వాక్‌స్థానమందు బృహస్పతి వున్నాడు. అందుచాతనే యింగిలీషు రాక పోయినా నా ప్రభ యిలా వెలుగుతూంది.

.

మధుర: మాటలు నేర్చిన శునకాన్ని వేటకి పంపితే ఉసుకోమంటే ఉసుకోమందిట.

.

రామ: నేనా శునకాన్ని?

.

మధుర: హాస్యానికన్న మాటల్లా నిజవఁకుంటారేవిఁ?

.

రామ: హాస్యానికా అన్నావు?

.

మధుర: మరి మీతో హాస్యవాఁడక పోతే, వూరందరితోటి హాస్యవాఁడ మన్నారా యేవి@టి?

.

రామ: అందరితో హాస్యవాడితే యరగవా?

.

మధుర: అంచేతనే కుక్కన్నా, పందన్నా మిమ్ముల్నే అనాలిగాని, మరొకర్ని అనకూడదే? మిమ్మల్ని యేవఁనడానికైనా నాకు హక్కు వుంది. యిక మీ మాటకారితనం నాతో చెప్పేదేమిటి? మీ మాటలకు భ్రమసే కదా మీ మాయలలో పడ్డాను?

.

రామ: నాకు యింగిలీషే వస్తే దొరసాన్లు నా వెనకాతల పరిగెత్తరా?

.

మధుర: మీ అందానికి మేము తెనుగువాళ్ళము చాలమో? యింగిలీషంటే జ్ఞాపకవచ్చింది. గిరీశం గారు మాట్లాడితే దొరలుమాట్లాడినట్లుంటుందిట

.

రామ: అటా, యిటా! నీకేం తెలుసును. వాడు వట్టి బొట్లేరు ముక్కలు పేల్తాడు. ఆ మాటలుగానీ కోర్టులో పేల్తే చెప్పుచ్చుకు కొడతారు

..

మధుర: అదేమో మీకే తెలియాలి!

Comments

Popular posts from this blog

గజేంద్ర మోక్షం పద్యాలు.

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!