సనాతన ధర్మపు రహస్యము!

సనాతన ధర్మపు రహస్యము!

.

మోక్షానికీ, లేదా స్వర్గానికీ అవశ్యకమైనది క్రీస్తుపైన విశ్వాసము మాత్రమే అన్నపుడు , క్రీస్తు కన్నా ముందు పుట్టి చనిపోయిన వారందరికీ ముక్తి దొరికే అవకాశము లేకుండినది అని వారికి స్వర్గము నిరాకరించవలసి వస్తుంది. వారంతా యే తప్పూ చేయకున్ననూ కేవలము వారు క్రీస్తు కన్నా ముందు పుట్టినారు అన్న క్షుల్లకమైన కారణముచేత మనము అలాగ చేయవలసి వస్తుంది. అదేవిధముగా , ఆ అవకాశాన్ని , జీసస్ గురించి తెలియని , వినని అతని సమకాలీకులకూ , మరియూ క్రీస్తు గురించి యేమీ తెలియక , ఈ యుగములోనే బతుకుతున్న కోటానుకోట్ల మంది ప్రజలకూ కూడా ముక్తికి అవకాశమే లేకుండా పొమ్మనవలసి వస్తుంది.

సృష్టి మొదలైన అనేక యుగాల తరువాత , అకస్మాత్తుగా ఏదో ఒకరోజు జ్ఞానోదయమై తెలివితెచ్చుకొని , మానవ కులానికంతటికీ ముక్తికి సాధనమైన మార్గము ఇదీ ...అంటూ భగవంతుడు ఒక ధర్మాన్ని విధించినాడా ? అది భగవంతుని లక్షణము కాదని మీరు గమనించలేదా ? అలాగచేయుట భగవంతునికి ఉచితమని భావిస్తున్నారా ? ఆ భగవంతుడు , జీసస్ పుట్టుటకు ముందే పుట్టిన వారికి కూడా ఆత్మ ఉంటుంది , ఆ ఆత్మలకు కూడా ముక్తి అవసరము అనేమాట మరచినాడా ? లేకపోతే ముక్తిసాధనమును రూపించుటలో అతడు జాగ్రత్త వహించినాడా ? అలాగ జాగ్రత్త వహించి ఉంటే , అతని ముక్తి సాధనము , ’ ముందు ముందు ఎప్పుడో జనించబోయే జీసస్ పైన నమ్మకము దానికి అత్యవసరము ’ అనే నియమానికి అది లోబడి ఉండుట సాధ్యము కాదు కదా ? కాబట్టి , సృష్టికి ఆదికాలములోనే మొట్టమొదటి వ్యక్తిని పుట్టించినపుడే , ఆ వ్యక్తికి ముక్తి సాధనమును కూడా కల్పించియే ఉండవలెను. దీన్నే వైచారిక నిరూపణ అంటారు. 

ఎందుకంటే ఆ మొట్టమొదటి మానవుడికి కూడా మోక్షపు అవసరము ఉంటుంది. అందుకే మేము , వేదము మరియూ మొట్టమొదటి మానవుడు [ హిరణ్యగర్భుడు ] ఇద్దరూ కూడా ప్రారంభము నుండే కలిసే ఉన్నారని నమ్మేది. కలిసే ఉన్నారు అంటే ఒకేసారి సృష్టించ బడినారు అని అర్థము కాదు. సృష్టికి ఆరంభమే లేదు. అంతా అనాది అనేది మా నమ్మకము. [ శాస్త్ర ప్రక్రియల అధికరణముల మూలముగా ఈ మాటను ఋజువు చేయవచ్చు ] . ఇవి కలిసే ఉన్నాయి అంటే , భగవంతుని చేత అవి రెండూ ఏకకాలములో వ్యక్తమైనాయి అని అర్థము. 

[ వేదపు మూలమును , అపౌరుషేయత్వమును అర్థము చేసుకొనవలెనంటే మీమాంసా శాస్త్రమును చదివితే చాలు ]

Comments

Popular posts from this blog

గజేంద్ర మోక్షం పద్యాలు.

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!